Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఆలేరురూరల్
రాష్ట్రాభివృద్ధి సీఎం కేసీఆర్‌తోనే సాధ్యపడుతుందని అందుకు కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి గ్రామానికి చేరవేసే విధంగా సీఎం చూస్తున్నాడని సర్పంచ్ వంగల శ్రీశైలం అన్నారు. మంగళవారం ఆలేరు మండలంలోని తూర్పు గూడెం గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని పరిశీలించి ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలోని 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పల్లె దావకాన డాక్టర్ సుప్రియ, భరత్ ,ఏఎన్ఎం లు కవిత రెడ్డి ,శ్రీలత, పంచాయతీ కార్యదర్శి ఇందిర, ఆశ వర్కర్లు షీలా, సరిత, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.