Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఆలేరురూరల్/ఆలేరుటౌన్
ర్యాగింగ్ భూతానికి బలైన గిరిజన ఆడబిడ్డ డాక్టర్ ధరావతు ప్రీతి మరణం చాలా బాధాకరం ఆమె మరణానికి కారణమైన సైకో సైఫును వెంటనే ఉరితీయాలని కాంగ్రెస్ మండల అధ్యక్షులు వెంకటేశ్వర రాజు అన్నారు. సోమవారం రాత్రి ఆలేరు నియోజకవర్గ కేంద్రంలో మండల కమిటీ ఆధ్వర్యంలో ప్రీతి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు పల్లె సంతోష్ ,నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కర్రె అజరు ,యూత్ పార్లమెంటు జనరల్ సెక్రెటరీ శివ శంకర్, కొలనుపాక కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి చాడ రాజు, మైనార్టీ సెల్ అధ్యక్షులు ఇమ్రాన్ ఖాన్, నాయకులు ఆంజనేయులు, రమేష్ ,శ్రీను, తదితరులు పాల్గొన్నారు.
ఆలేరుటౌన్: వైద్య విద్యార్థిని ప్రీతి మరణానికి నిరసనగా బస్టాండ్ చౌరస్తా ఆవరణలో ఎన్ఎస్ఈఐ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. . బాధిత కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కలకుంట్ల లోకేష్ , జూకంటి సంపత్, సుంకర విక్రమ్ , జావేద్, కాసుల భాస్కర్, మక్సుద్,భీమ గాని ప్రభు, సాయికుమార్ ,బాబా, శ్రీనివాస్ గణేశ్ తదితరులు పాల్గొన్నారు.