Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్థానిక సీఐ చింత మోతిరామ్
- ఘనంగా నేషనల్ సైన్స్‌డే
నవతెలంగాణ- రామన్నపేట
విజ్ఞాన ప్రదర్శనలు విద్యార్థులలో ఆలోచన నైపుణ్యాలను, సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించడానికి దోహదపడుతాయని సీఐ చింత మోతిరామ్, స్థానిక సర్పంచ్ గోదాసు శిరీష పృథ్వీరాజ్ అన్నారు. మండల కేంద్రంలోని క్రిష్ణవేణి టాలెంట్ స్కూల్లో మంగళవారం నేషనల్ సైన్స్ డే ను పురస్కరించుకొని విద్యార్థులు సైన్స్ ఫెయిర్ ను ఘనంగా నిర్వహించారు. మోతి రావు సైన్స్ ఫెయిర్ ను ప్రారంభించగా గోదాసు శిరీష పృధ్విరాజ్ జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ నేటి విద్యార్థులలో చదువుతో పాటు సాంకేతిక విజ్ఞానాన్ని పెంపొందించే దిశగా ఉపాద్యాయులు, తల్లిదండ్రులు కృషి చేయాలని వారు సూచించారు. అంతకుముందు పర్యావరణ, వైద్య, అంతరిక్ష, రవాణా తదితర అంశాలపై విద్యార్థులు రూపొందించిన ప్రదర్శనలను వారు తిలకించి విద్యార్థులను, వారికి సహకరించిన ఉపాధ్యాయులను వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ గంగుల నరేందర్ రెడ్డి, ప్రిన్సిపాల్ జె. వి. ఎన్. ఎస్ మణి, ఉపాధ్యాయులు మురళీ, రషీద్, నరేష్, శ్యామ్, మహాలక్ష్మీ, అస్మా, సుమయా, పూనమ్, నిర్మల, కరుణ, లక్మిదేవి, జానకి తదితరులు పాల్గొన్నారు.
సైన్సులో ద్వారా వస్తున్న ఆవిష్కరణలు ప్రపంచగతిని మార్చేశాయని, సైన్సు మూలంగానే ప్రజల జీవితంలో అభివృద్ధిసాధ్యమైందని స్ధానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రధానాచార్యులు డా.బెల్లి యాదయ్య అన్నారు. జాతీయ సైన్సు దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలవిజ్ఞాన శాస్త్రాల విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం ప్రధానచార్యులు డాక్టర్ పెళ్లి యాదయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో అభివృద్ధి చెందిన సమాజాలు రాకెట్ యుగం వైపునకు దూసుకుపోతుంటే, వెనుకబడిన సమాజాలు మూఢనమ్మకాల వెనకాల ఇంకా పరుగులు పెడుతున్నారని, విద్యావంతులు, అధ్యాపకులు, విద్యార్థులు సైన్సు వ్యాప్తికి కృషిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. విద్యార్థులకు ఆవిష్కరణల పట్ల ఆసక్తిని పెంపొందించే బాధ్యత సైన్సు అధ్యాపకులు తీసుకోవాలనిన్నారు. అంతకుముందు సివి రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాస రెడ్డి, రసాయన శాస్త్ర సహాయాచార్యులు డా.బాలనర్సింహ, ఆంగ్ల సహాయాచార్యులు మక్లా, విద్యార్థి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
మోత్కూరు : విద్యార్థులు సైన్స్, టెక్నాలజీ పట్ల ఆసక్తిని పెంచుకోవాలని, సైన్స్ మేళాతో విద్యార్థులకు ఎంతో అవగాహన పెరుగుతుందని ఇండియన్ రెడ్ క్రాస్ యాదాద్రి జిల్లా చైర్మన్ డాక్టర్ జి.లక్ష్మీ నర్సింహారెడ్డి అన్నారు. మోత్కూరు ఉన్నత పాఠశాలలో రెండు రోజుల పాటు నిర్వహించే సైన్స్ మేళాను మంగళవారం హెచ్ఎం టి.అంజయ్య సీవీ.రామన్ చిత్రపటానికి పూలమాల వేసి, జ్యోతి వెలిగించి ప్రారంభించగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే సైన్స్, టెక్నాలజీపై అవగాహన పెంపొందించుకోవాలన్నారు.ఈకార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక జిల్లా బాధ్యులు ఎస్.భాస్కరాచారి, టీచర్లు ఇ.రాంప్రసాద్,బి.దుర్గాప్రసాద్, రాంరెడ్డి, వెంకటాచారి, సుధీర్ కుమార్, లలితకుమార్, కవిత, సైదులు, వెంకన్న,అచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
భువనగిరి : జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల బీచ్ మహల్ నందు సైన్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని రోటరీ క్లబ్ అధ్యక్షులు బండారు శ్రీనివాసరావు జన విజ్ఞాన వేదిక జిల్లా ఉపాధ్యక్షులు కాచరాజు జయప్రకాష్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం.భాస్కర్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు సొంతంగా తయారుచేసిన పలు ప్రాజెక్టులను వారు తిలకించారు. ప్రదర్శనలో ఏర్పాటు చేయబడిన వాటిలో ఉత్తమమైన వాటిగా జెసిబి ప్రాజెక్ట్ టెస్లా ప్రాజెక్ట్ ఫైర్ అలారం ప్రాజెక్టులను గుర్తించి విద్యార్థులకు బహుమతి ప్రధానోత్సవం చేశారు. ఈ మినీ సైన్స్ ప్రదర్శన వెనక ఉన్న సైన్స్ టీచర్లు అయినా, దుద్యాల రామచంద్రం, జక్కిడి వెంకట్ రెడ్డి కృషిని అభినందిస్తూ వారికి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు సిహెచ్ సత్యనారాయణ రెడ్డి, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
వలిగొండ: మండల కేంద్రంలోని స్థానిక మాంటిస్సోరి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో మంగళవారం నేషనల్ సైన్స్ డే విజ్ఞాన్ 2023 జాతీయ సైన్స్ డే దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు తమ సైన్స్ ఎగ్జిబిషన్ ప్రదర్శించారు తల్లిదండ్రులు విద్యార్థులు రకరకాల ఆసక్తికర అంశాలను తొలగించారు. అనంతరం ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అకాడమిక్ డైరెక్టర్ మేడం మధులత, పాఠశాల డైరెక్టర్ కొండూరు బాలరాజు, ప్రధానోపాధ్యాయులు థామస్ అబ్రహం, అను జరీన్ ,మను, తదితరులు పాల్గొన్నారు.