Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు ప్రాజెక్ట్ కేంద్రాల్లో ర్యాలీలు
- సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోమటిరెడ్డి చంద్రారెడ్డి
నవతెలంగాణ - బీబీనగర్
అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం నేటి నుండి 3 వరకు జరిగే రాష్ట్రవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోమటిరెడ్డి చంద్రారెడ్డి అంగన్వాడీలకు పిలుపునిచ్చారు. మంగళవారం బీబీనగర్‌లో జరిగిన బీబీనగర్ సెక్టార్ మీటింగ్ లో చంద్రారెడ్డి పాల్గొని అంగన్వాడీటీచర్స్ తో కలిసి సమ్మెకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 4 లేబర్ కోడ్స్‌ను రద్దు చేయాలని, ఐసిడిఎస్ కు కేంద్రం బడ్జెట్ పెంచాలని, నూతన జాతీయ విద్యావిధానాన్ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్రంలో గ్రాట్యుటి చట్టాన్ని అమలు చేయాలన్నారు. జీఓ నెం 14, 19, 8 లను వెంటనే సవరించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల జిల్లా కమిటి సభ్యులు గాడి శ్రీనివాస్, బండారు శ్రీరాములు, నాయకులు తాండ్ర సుశీల, వర్కల ధనలక్ష్మి, కట్ట భాగ్యలక్ష్మి, ఊట్కూరి హేమలత, మక్తాల మనోహర, కవిత, సునిత, హైమవతి, విజయలక్ష్మి, శోభ, ధనలక్ష్మి, సరస్వతి, వసంత పాల్గొన్నారు.