Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ- భువనగిరి రూరల్
భువనగిరిలో గతంలో ఇంటి స్థలాలకు పట్టాలిచ్చిన వారికి ఇండ్లస్థలాలు ఇవ్వాలని కోరుతూ మంగళవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట మున్సిపల్ మాజీ చైర్మెన్ కొలుపుల కమలాకర్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2005 సంవత్సరంలో సర్వేనెంబర్ 700 లో 127 మందికి ఇంటి స్థలాలు పట్టా సర్టిఫికెట్ ఇచ్చినట్లు, జులై 18, 2009 హుస్సేనాబాద్ లోని సర్వే నెంబర్ 107 లో 489 మందికి ఇంటి స్థలాల పట్టాలను ఇచ్చారని అన్నారు. గతంలో ఇచ్చిన స్థలాలను భీష్మెంటును నేలమట్టం చేసి ఇతరులకు ఇవ్వడం సమంజసం కాదన్నారు. నిరుపేదలకు పట్టాలు పొందిన వారికి వెంటనే ఇండ్ల స్థలాలు కేటాయించాలని లేని యెడల ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బిసుకుంట్ల జహంగీర్, ఆకుల యాదగిరి, చింతకాయల ఉపేందర్, కొమురయ్య, సత్యనారాయణ, బాలమణి, శోభ, మంజుల , నిర్మల, కృష్ణవేణి, ఇందిరా, బాలరాజు, నాగమణి, బిక్షపతి లు పాల్గొన్నారు.