Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశంలోనే సూర్యాపేటను నెంబర్‌వన్‌గా చేస్తా
- రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
దర్జీ బతుకుల్లో దర్జా మాయం అవడానికి కారణం కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్న బీజేపీయేనని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం స్థానిక సూర్యాపేట ఫంక్షన్హాల్లో మేరు సంఘం ఆధ్వర్యంలో జరిగిన ప్రపంచ టైలర్స్ డే వేడుకలో ఆయన మాట్లాడారు.మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే కులవృత్తులకు పూర్వవైభవం లభించిదన్నారు.బీజేపీ విధానాలతో కులవృత్తులు కుదేలవుతున్నాయన్న మంత్రి అదానీ, అంబానీల కోసం చేతి వృత్తులకు అన్యాయం చేస్తున్న బీజేపీని దేశం నుండి తరిమి కొట్టాలని ప్రజలకు పిలుపు నిచ్చారు.గతంలో మేరు కులానికి చెందిన వారు మాత్రమే దర్జీ వృత్తిని చేపట్టేవారు పండుగలు, శుభకార్యాల సమయంలో వారికి చేతినిండా పని ఉండేదని పేర్కొన్నారు. తిందామన్నా తీరిక ఉండేది కాదన్నారు.కానీ బీజేపీ ప్రభుత్వం వచ్చాక అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ల కోసం దర్జీల జీవితాలను చీకట్లోకి నెడుతున్నారని మండిపడ్డారు.అదానీ, అంబానీల రెడీమేడ్ దుస్తుల రాకతో పరిస్థితి దయనీయంగా మారిందిన్నారు. మార్కెట్లోకి వస్తున్న కొత్త కొత్త ఫ్యాషన్లకు అనుగుణంగా బట్టలు కుట్టే నేర్పు ఉన్నా.. రెడీమేడ్ దుస్తుల వల్ల వారికి ఆదరణ తగ్గుతూ వస్తోందన్నారు.ప్రపంచంలోనే అత్యధిక జానాబా ఉన్న భారతదేశంలో కార్పొరేట్ల అవసరం లేదన్నారు.కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక మళ్ళీ కుల వృత్తుల కు ప్రోత్సాహం లభించిందన్నారు.