Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి
నవతెలంగాణ-అర్వపల్లి
కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సీఐటీయూ, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో 10 లక్షల మందితో జరిగే ప్రదర్శన జయప్రదం చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం మండలకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు.కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రైతువ్యతిరేక చట్టాలను దొడ్డిదారిన అమలు చేయడానికి ప్రయత్నిస్తుం దన్నారు.ఈ నల్లచట్టాలను నిరసిస్తూ ఉపాధి హామీ చట్టాలను నిర్వీర్యం చేస్తూ పేదవారి కడుపును కొడుతుందని విమర్శించారు. బడ్జెట్లో నిధులను తగ్గించిందన్నారు.కేంద్ర విధానాలను నిరసిస్తూ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కొలిశెట్టియాదిగిరిరావు, మండల కార్యదర్శి వైద్య శ్రీనివాస్, జిల్లా కమిటీ సభ్యులు పులుసు సత్యం,శేఖర్, నర్సింహారావు, సరోజ, విజయ,అవిలయ్య,శికవెంకన్న, అబ్బులు, మేడమైన సైదులు, వైద్య సైదులు, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.