Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హుజూర్ నగర్
వైద్య విద్యార్థి ధరావత్ ప్రీతి మృతికి నిరసనగా పట్టణంలోని మిర్యాలగూడ రోడ్డు నుండి పాత బస్టాండ్ వరకు గిరిజన సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకులు వెంకట్రావు, ధరావత్ నవీన్‌నాయక్,గిరిజన హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నగేష్ రాథోడ్, డాక్టర్ వెంకటాద్రినాయుడు మాట్లాడారు.సీనియర్ విద్యార్థి సైఫ్ ర్యాగింగ్ భూతానికి తట్టుకోలేక మత్తు ఇంజక్షన్ తీసుకొని ప్రీతిచనిపోయిన సంఘటన గిరిజన సమాజాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు.ప్రీతి మృతికి కారణమైన సైఫ్‌ను ఎన్కౌంటర్ చేయాలని, ప్రీతి కుటుంబంలో ఒకరికి గ్రూప్-1 స్థాయి ఉద్యోగం ఇవ్వాలని కోరారు.వారి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు.ఇలాంటి ఘటనలు తిరిగి పునరావృతం కాకుండా ప్రభుత్వం చూడాలన్నారు.ఈ కార్యక్రమంలో గిరిజన సంఘాల నాయకులు సైదానాయక్, నాగునాయక్, సైదులునాయక్, కౌన్సిలర్ రాజా, రవి, చిన్నబాలాజీ, డాక్టర్ వెంకటాద్రినాయక్ డాక్టర్ జలేంద్రుడు,శ్రీను, నగేష్, సురేష్బాబునాయక్, నాగేశ్వరరావు,నవీన్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.