Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మద్దిరాల
సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జమీందార్ మల్లయ్య అన్నారు.మంగళవారం మండలపరిధిలోని రెడ్డిగూడెం గ్రామంలో సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైబర్ నేరగాళ్లు ఫోన్ ఆధార్ కార్డు ఓటీపీ నెంబర్లను అడిగి ఘరానా మోసాలకు పాల్పడుతున్నారని, ఎవరైనా బ్యాంకు ఆధారాలు గాని అడిగినచో వారు ఎవరో తెలుసుకొని సమాచారం ఇవ్వాలన్నారు. లేనట్లయితే వారి ఖాతాలో ఉన్న డబ్బులు కాజేస్తున్నారని తెలిపారు. గ్రామాల్లో ఎవరైనా అపరిచితమైన వ్యక్తులు వచ్చినచో పోలీసు శాఖకు 100కు డయల్ చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది శ్రీనివాస్, చంద్రయ్య, కళ్లెం మధు, గ్రామస్తులు చాపల వెంకన్న, తాందారి ప్రతాప్‌గౌడ్,రేటినేని వెంకటయ్య, గుండాల కిరణ్, జెన్నయ్య, దుగ్యాల కిషన్‌రావు, గుండాల లింగయ్య పాల్గొన్నారు.