Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేరేడుచర్ల
కడదాకా కమ్యూనిస్టుగా. మార్క్సిస్టు పార్టీ మార్గదర్శకుడిగా ఆదర్శవంతమైన జీవితం గడిపి ఎర్రజెండా నాయకత్వంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం పరితపించిన వ్యక్తి పారేపల్లి మోహన్రావు అన్నారు.ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీసభ్యులు కె.అనంతప్రకాష్, కొదమగుండ్ల నగేష్,సిరికొండ శ్రీను అన్నారు.మంగళవారం మండల కేంద్రంలోని స్థానిక సీపీఐ(ఎం) కార్యాలయం అరిబండి భవన్లో పారేపల్లి మోహన్రావు 3వ వర్థంతి సందర్భంగా. నిర్వహించిన సభలో ఆయన చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేరేడుచర్ల ప్రాంతంలో ఎస్ఎఫ్ఐ విద్యార్థి ఉద్యమ నిర్మాతగా, ఎంతోమంది విద్యార్థి ఉద్యమకారుల తయారుచేసి మార్క్సిస్టు పార్టీకి అందించిన నేతగా మోహన్రావు పేరుగాంచారన్నారు.ప్రజాఉద్యమాలలో విద్యార్థి యువజన సంఘ నాయకునిగా, కమ్యూనిస్టు పార్టీ నాయకునిగా ఉంటూ నేరేడుచర్ల గ్రామపంచాయతీలో వరుసగా మూడుసార్లు వార్డు సభ్యుడుగా ఎన్నికై ప్రజా సమస్యల పరిష్కారం కోసం అలుపెరగని కృషి చేశారన్నారు.పాత్రికేయునిగా నిత్యం ప్రజాఉద్యమాలను పత్రికారంగంలో ప్రతిబింబించేలా కృషి చేశారన్నారు.అలాంటి వ్యక్తి క్యాన్సర్ మహమ్మారి సోకి అనారోగ్య కారణాలతో మరణించడం బాధాకరమన్నారు.ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ధనంజయనాయుడు,సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు కుంకు తిరుపతయ్య,బీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి చిత్తలూరిసైదులు, సీఐటీయూ జిల్లా నాయకురాలు వరలక్ష్మీ, ఐద్వా జిల్లా నాయకురాలు మొగిలిచర్ల రుద్రమ్మ, సీఐటీయూ మండలకన్వీనర్ నీల రామ్మూర్తి, రైతుసంఘం మండలకార్యదర్శి పాతూరి శ్రీనివాసరావు, సీపీఐ(ఎం) శాఖకార్యదర్శులు ఎస్కె హఫీజ్, ఎడ్లసైదులు, మోసయ్య, గిరిజనసంఘం జిల్లా నాయకులు కోటినాయక్, మహిళా సంఘం నాయకులు కృష్ణవేణి,ఎస్ఎఫ్ఐ మాజీ నాయకులు చిత్తలూరి బాలసైదులు, ఎస్కె.మదార్, చిలకరాజు వీరస్వామి,కొమ్మరాజు గణేష్, సీపీఐ నాయకులు లక్ష్మీ, చిలకరాజు శ్రీను, రావుల సత్యం,సింహాద్రి పాల్గొన్నారు.