Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పాలకీడు
మండలంలోని జాన్‌పహాడ్ దర్గా గ్రామపంచాయతీ అభివృద్ధికి నిరంతరంగా కృషి చేస్తానని పాలకవీడు జెడ్పీటీసీ మాలోతు బుజ్జి మోతిలాల్‌నాయక్ స్పష్టం చేశారు.మంగళవారం గ్రామపంచాయతీ పరిధిలో రూ.13 లక్షలతో చేపట్టనున్న సీసీరోడ్డు నిర్మాణపనులను ఎంపీపీ భూక్యాగోపాల్తో కలిసి ప్రారంభించి మాట్లాడారు.మండల అభివృద్ధికి సహకరించాలని కోరిన వెంటనే నల్లగొండఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఈజీఎస్ నుండి రూ 8 లక్షలు మంజూరు చేయించగా జెడ్పీ చైర్పర్సన్ దీపికా యుగంధర్ రావు సహకారంతో మరో రూ.5 లక్షల ఈజీఎస్ నిధులతో పనులు చేపడు తున్నా మన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామసర్పంచ్ రమావత్గౌరిరాజు, ఎంపీటీసీలు బానోతు విజయవెంకటి, కవిత నీమానాయక్, బెట్టేతండా సర్పంచ్ మాలోతు మోతిలాల్ నాయక్, దర్గా పూజారి జానిబాబా, కాంగ్రెస్ నాయకులు రాములు, నాగరాజు, మల్లయ్య పాల్గొన్నారు.