Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేటరూరల్
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్రాజ్యాంగం ద్వారా కల్పించిన ప్రతి హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని ఎంపీపీ బీరవోలు రవీందర్‌రెడ్డి,జెడ్పీటీసీ జీడి భిక్షం అన్నారు.మంగళవారం మండలపరిధిలోని ఎండ్లపల్లి గ్రామంలో పౌర హక్కులదినోత్సవం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్థికంగా, సామాజికంగా, ముందుకు పోవాలని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కన్న కలలను నిజం చేయడం కోసం మనమందరం కలిసి మెలిసి ఉండలన్నారు. ఎస్సీ కమ్యూనిటీ హాల్,మౌలిక వసతులు లేక నిరుపయోగంగా ఉందన్నారు.మంత్రి జగదీష్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారమయ్యేలా కృషి చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో వైస్‌ఎంపీపీ శ్రీనివాసనాయుడు,విజిలెన్స్ కమిటీ సభ్యులు చిన్నశ్రీరాములు, సర్పంచ్ సుగుణమ్మ ,ఎంపీటీసీ సరిత, తహసీల్దార్ వెంకన్న,ఆర్ఐ రవి, సూపరింటెండెంట్ లక్ష్మీ, మాజీ సర్పంచ్ సుదర్శన్‌రెడ్డి, వార్డు సభ్యులు రవి, వెన్నెల, జానయ్య, సువర్ణ, జానయ్య, హైస్కూల్ హెడ్మాస్టర్ వసివుల్లా, ప్రైమరైస్ స్కూల్ హెచ్ఎం వెంకటేశ్వర్లు, గ్రామ కార్యదర్శి గీత, ఏఈఓ చైతన్య,లక్ష్మీ, అంగన్వాడీ టీచర్లు భాగ్యలక్ష్మి, పద్మ, గ్రామపెద్దలు తదితరులు పాల్గొన్నారు.