Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోదాడరూరల్
మహిళల పురోగభివృద్ధితోనే సమాజ ప్రగతి సాధ్యమవుతుందని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ ఆకుల లలిత పేర్కొన్నారు.మంగళవారం హైదరాబాదు నగరంలోని చందానగర్ సుప్రజా రెసిడెన్సీలో మున్నూరుకాపు అపెక్స్ కౌన్సిల్ కన్వీనర్ సర్దార్ పూటం పురుషోత్తమరావు పటేల్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటైన మున్నూరు కాపు మహిళా పరస్పర సహకార పొదుపు, పరపతి సంఘం(మహిళా బ్యాంక్ ) డైరెక్టర్ల ఎన్నిక కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మున్నూరు కాపు మహిళలు స్వశక్తి, స్వాలంబన సాధించేందుకు మహిళా బ్యాంకు ఏర్పాటు చేయడం శుభపరిణామమన్నారు.మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ఈ బ్యాంకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.మహిళల ఆర్థికప్రగతి సాధించేందుకు ఏర్పాటైన ఈ బ్యాంకు దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.అనంతరం రాష్ట్రవ్యాప్తంగా 45 మంది మహిళా డైరెక్టర్లను ఎన్నుకున్నారు.ఇందులో కోదాడకు చెందిన పీఏసీఎస్ చైర్మెన్ ఆవుల రామారావు సతీమణి ఆవుల విజయలక్ష్మీ డైరెక్టర్గా నియామకం అయ్యారు.ఈ సందర్భంగా ఆవుల రామారావు దంపతులు ఆకులలలితను శాలువా,పూలబొకేతో ఘనంగా సన్మానించారు.ఈ సమావేశంలో అపెక్స్ కౌన్సిల్ కోరం కనకయ్య, ప్రముఖ వ్యాపారవేత్త తుడి ప్రవీణ్, పొట్ట జగన్మోహన్రావు, మామిళ్ళ శ్రీనివాస్, వేల్పుల శ్రీనివాస్,కర్నాకర్రావు, ఆకులస్వామి, వివేక్, పాల్గొన్నారు.