Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోదాడరూరల్
గ్రామపంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు సోమపంగు రాధాకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మంగళవారం హైదరాబాదులో నిర్వహిస్తున్న గ్రామపంచాయతీ సిబ్బంది ముగింపు పాదయాత్ర సందర్భంగా మండల గ్రామపంచాయతీ సిబ్బంది సీఐటీఊ ఆధ్వర్యంలో హైదరాబాద్కు వాహనాల ద్వారా బయల్దేరారు.వాహనాలను జెండా ఊపి ఆయన ప్రారంభించి మాట్లాడారు.గ్రామపంచాయతీ కార్మికుల సమస్యల కోసం ఈనెల 12న పాలకుర్తి నుండి ప్రారంభించిన పాదయాత్ర ముగింపు సందర్భంగా వెళ్తున్నామన్నారు.పంచాయతీ కార్మికులు కనీస వేతనం నెలకు రూ.26000 ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. మల్టీపర్పస్ విధానాన్ని తొలగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ముత్తయ్య, కరీం, లింగయ్య, నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు, స్వాతి, లలిత, మరియమ్మ తదితరులు పాల్గొన్నారు.
మునగాల : తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గ్రామ పంచాయతీ కార్మికులు హైదరాబాద్కు తరలివెళ్లారు. కార్యక్రమాన్ని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు బచ్చలకూర స్వరాజ్యం జెండా ఊపి ప్రారంభించారు.తరలివెళ్లిన వారిలో తెలంగాణ గ్రామపంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ అనుబంధ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు వాసమేకల వెంకటేశ్వర్లు, బండారు గురవమ్మ, గ్రామ పంచాయతీ కార్మికులు మామిడి వెంకన్న, రామారావు, కె.పరుశ రాములు, రాములు, డి.రవి, ఆర్.వెంకటయ్య, బి.రాజు, బ్రహ్మం, మధు, ఎల్లమ్మ, పార్వతి, నాగేంద్ర, రాములమ్మ, వీరబాబు, పరుశరాములు ఉన్నారు.