Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వారంలో పురోగతి సాధించాలి లేదంటే చర్యలు
- సోషల్ ఆడిట్ జరిమానాలను వారంలో రికవరీ చేయాలి
- అదనపు కలెక్టర్ ఖుష్బూ గుప్తా
నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ పథకం కింద అన్ని గ్రామపంచాయతీల్లోఉపాధిహామీ పనులు గుర్తించి ప్రారంభించాలని, ప్రతి గ్రామపంచాయితీకి 100 మందికి తక్కువ కాకుండా కూలీలు పనికి హాజరయ్యేలా తగు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ ఖుషఉ్బ గుప్తా ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి మండల పరిషత్తు అభివృద్ధి అధికారులు, మండల పంచాయతీ అధికారులు, అదనపు ప్రోగ్రాం అధికారులతో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించి లేబర్ మొబిలైజేషన్, నర్సరీలు, ప్రాపర్టీ టాక్స్ కలెక్షన్, సోషల్ ఆడిట్ రికవరీస్, తెలంగాణ క్రీడా ప్రాంగణం లు ఏర్పాటు, తెలంగాణకు హరితహారం , బృహత్ పల్లె ప్రకృతి వనాల పనులు, సి.సి.రోడ్ల పురోగతిపై సమీక్ష నిర్వహించినారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూలేబర్ మొబిలైజేషన్ లో తక్కువ ఉన్న మండలాలు వచ్చే వారంలోపు పురోగతి సాధించాలని లేనిచో శాఖాపరమైన చర్యలు గైకోనబడునని ఆమె హెచ్చరించారు.ఇ.జి.యస్. క్షేత్రస్థాయి సిబ్బంది ప్రతి గ్రామపంచాయితీలో లేబర్ మీటింగ్స్ ఏర్పాటు చేసి ఏ పనులు చేయాలి,ఎన్ని గంటలు చేయాలి, ఎన్ని గంటలు పని చేస్తే, ఎంత పని చేస్తే పూర్తీ వేతనం 257 రూపాయలు వస్తుంది, ఎన్.ఎం.ఎం.ఎస్ హాజరుపై కూలీలకు అవగాహన కల్పించాలని సూచించారు.మన ఊరు మన బడి ప్రొగ్రాంలో ఇ,జి,యస్. కు సంబంధించిన పనులను త్వరగా పూర్తి చేయాలని అన్నారు.అన్ని గ్రామ పంచాయతీ , ఆవాసాలలో తెలంగాణ క్రీడా ప్రాంగణంలు ఏర్పాటు గ్రౌండింగ్ పూర్తి చేయాలని ఆదేశించారు. క్షేత్ర సహాయకుల నుండి సోషల్ ఆడిట్ లో విధించిన జరిమానాలను ఈ వారంలోపు రికవరీ చేయాలన్నారు. వేసవి కాలం వస్తున్నందున అన్ని నర్సరీలలో షేడ్ నెట్ అమర్చాలని తెలిపారు. జిల్లాలో అన్ని నర్సరీలో 100 శాతం జర్మినేషన్ వచ్చేలా తగు చర్యలు తీసుకోవాలన్నారు.నర్సరీలలో మొక్కలు ఏపుగా పెరగటానికి జీవామృతం తయారు చేసి మొక్కలకు పిచికారీ చేయాలని ఆదేశించారు.నర్సరీలు నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. ప్రాపర్టీ టాక్స్ కలెక్షన్స్ వసూలు చేసి ఆన్ లైన్ లో ఎంట్రీ చేయాలని, వసూలు చేసిన టాక్స్ లైబ్రరీ సెస్ 8 శాతం జమ చేయాలన్నారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి ప్రేమ్ కరణ్ రెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు పి.డి.శైలజ,తదితరులు పాల్గొన్నారు.