Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వర్షిత హాస్పిటల్ లో ఆరోగ్య సేవలు ప్రారంభించిన ఎమ్మెల్యే
నవతెలంగాణ-మిర్యాలగూడ
పేదలకు మెరుగైన వైద్య సేవలందించాలని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు.పట్టణంలోని వర్షిత హాస్పిటల్లో ఆరోగ్య సేవలను మంగళవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు.కార్పొరేట్ ఆస్పత్రులు సేవాదృక్పథంతో పేదలకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్య సేవలు అందించాలని కోరారు.ప్రయివేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వాస్పత్రులను అభివృద్ధి పరుస్తున్నామన్నారు.మిర్యాలగూడలో ఏరియాస్పత్రిని 200 పడకల ఆస్పత్రిగా మారుస్తున్నామని చెప్పారు.ప్రభుత్వాస్పత్రిలో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.నియోజవర్గ స్థాయిలో 28 పల్లె దవఖానలు, పట్టణంలో రెండు బస్తీ దవఖానాలు ఏర్పాటు చేశామన్నారు. గ్రామీణ స్థాయిలోనే మెరుగైన వైద్య సేవలు అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ తిరునగర్ భార్గవ్, వైస్చైర్మెన్ కుర్ర విష్ణు, వర్షిత ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ కుటాల రాంబాబు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చేకూరి హనుమంతరావు,సుశ్రుత గ్రామీణవైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు హనుమంతరావు, కౌన్సిలర్ మహమ్మద్ ఇలియాజ్, గ్రామీణ వైద్యుల సంఘం రాష్ట్ర నాయకులు తన్నీరుసత్యనారాయణ, ఆర్థోపెడిక్ డాక్టర్ శ్రీనివాసరెడ్డి, ఆయా సంఘాల నాయకులు డాక్టర్ మునీర్, మల్సూర్, హుస్సేన్, గోవర్ధన్, ద్రోణాచారి, కెమిస్ట్రీ అసోసియేషన్ అధ్యక్షులు గోవర్ధన్, జానిపాషా, రమేష్ తదితరులు పాల్గొన్నారు.