Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేత్రపర్వంగా లక్ష్మీ నరసింహుని కల్యాణ వేడుక
- ప్రభుత్వం తరుపున మంత్రులు పట్టు వస్త్రాలు అందజేత
- కల్యాణానికి హాజరైన సీఎం సతీమణి
నవతెలంగాణ -యాదగిరిగుట్ట
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా మంగళవారం నిర్వహించారు.బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు ఉదయం ఆలయంలో పంచరాత్ర ఆగమశాస్త్ర రీతిలో నిత్యకైంక్యర్యాలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని శ్రీరామ అలంకారంతో హనుమంత వాహనంపై అలంకరించి మాడవీధుల్లో ఊరేగించారు. భగవానుడు దుష్టశిక్షణ, శిష్ట పరిరక్షణ అర్థం అవతరించిన అవతారాల్లో మహోన్నతమైంది శ్రీరామవతారమని అర్చకులు తెలిపారు. సాయంత్రం అత్యంత ప్రాధాన్యత కలిగిన తిరు కల్యాణంలో భాగంగా లక్ష్మీనరసింహస్వామిని గజవాహనంపై మాడవీధుల్లో ఊరేగించారు. అనంతరం దేవస్థాన ఆలయ ప్రాంగణంలో అత్యంత వైభవంగా భక్తుల ఆనంద కోలహాల మధ్య వేద పండితుల వైదిక మంత్ర ప్రార్థన లతో మంగళ వాయిద్యాలతో కల్యాణ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. కల్యాణ ఉత్సవంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నుండి మంత్రులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి , గుంటకండ్ల జగదీశ్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. కల్యాణ వేడుకకు ముఖ్యమంత్రి హజరు కావల్సి ఉండగా ఆయన బార్య శోభ కల్యాణంలో పాల్గొన్నారు.తిరుమల తిరుపతి దేవస్థానం నుండి కూడా స్వామి అమ్మవార్లకు టీటీడీ దేవస్థానం అర్చకులు ఈఓ గీతారెడ్డికి పట్టు వస్త్రాలు అందజేశారు.ఈ వేడుకల లో ఎమ్మెల్యే గోంగిడి సునిత మహెందర్ రెడ్డి కలెక్టర్ పమేలా సత్పతి,జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి మాజి మంత్రి సునిత రెడ్డి,స్థానిక నాయకులు ప్రజాపాల్గొన్నారు కొనసాగుతున్న ధార్మిక సభలు
ఉత్సవాల లో భాగంగా ఈ నెల 2 వరకు కొనసాగుతున్న ధార్మిక సాహిత్య సంగీత మహాసభలో భాగంగా మంగళవారం ఉదయం వైష్ణవ సమైక్య వారితో ప్రబాత బేరి నిర్వహించారు. పాండురంగ స్వామి భజన మండలి భూదాన్ పోచంపల్లి,గాయత్రి మహిళా భజన మండలి గుట్ట వారితో భజన కార్యక్రమం చేపట్టారు .అనంతరం ఆస్థాన విధ్వాంసులతో వైదిక ప్రార్ధన నిర్వహించి మైలవరపు శ్రీనివాసరావుతో నృసింహ తత్వంపై ఉపన్యాసం చేపట్టారు.రాత్రి చేబ్రోలు నారాయణ దాసు భగవతార్ తో భీష్మ ప్రతిజ్ఞ అనే హరికథ గానం నిర్వహించారు. సాయంత్రం లలిత ఫైనాన్స్ వారితో కూచిపూడి నృత్యం జయప్రద రామమూర్తి గారితో వేణుగాన క చేరి చేపట్టారు.
ఉచిత వైద్య శిబిరం
ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు కూడా స్థానిక పిహెచ్సి డాక్టర్లు వంశీకృష్ణ హరీష్ నేతృత్యంలో కొండపైన బస్టాండ్ వద్ద కొండ కింద కళ్యాణకట్ట వద్ద ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. .శ్రీకర హాస్పిటల్స్ పీర్జాదిగూడ సాయి సంజీవని హాస్పిటల్ వారు కూడా భక్తులకు వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు.