Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మిత సబర్వాల్
నవతెలంగాణ- భువనగిరిరూరల్
విద్యార్దులు ప్రయోగాలు చేసే దిశగా ఎదగాలని, కొత్త ఆవిష్కరణలు రూపొందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్ విద్యార్థులకు ఉద్బోధించారు. మంగళవారం నాడు ఆమె శాసన మండలి సభ్యులు ఎలిమినేటి కృష్ణారెడ్డి తో కలిసి భువనగిరి మండలం అనంతారం గ్రామం జిల్లా పరిషత్ హైస్కూల్లో సిఎస్ఆర్ (కార్పోరేట్ సోసియో రెస్పాన్సిబిలిటీ) క్రింద తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిగా ఏర్పాటు చేసిన స్టెమ్ ల్యాబ్ ను ప్ర్రారంభించారు. ల్యాబ్ లోని పరికరాలను, విద్యార్థుల నూతన ఆవిష్కరణలను పరిశీలించారు. ఈ సందర్భంగా కార్యదర్శి విద్యార్ధులతో మాట్లాడుతూ, జాతీయ సైన్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు మంచిగా చదవాలని, సైన్స్ లో ప్రయోగాలు, నూతన ఆవిష్కరణలు రూపొందించే దిశగా ఎదగాలని, ల్యాబ్ లో మంచి మంచి పరికరాలు ఉన్నాయని, ఇలాంటి మంచి అవకాశాలను విద్యార్థులు వినియోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టరు దీపక్ తివారీ, భువనగిరి రెవిన్యూ డివిజనల్ అధికారి భూపాల్ రెడ్డి, ఎంపిపి నరాల నిర్మల వెంకటస్వామి యాదవ్, జడ్పిటిసి సుబ్బురు బీరు మల్లయ్య, జిల్లా విద్యా శాఖ అధికారి నారాయణరెడ్డి, మండల విద్యా శాఖ అధికారి నాగవర్ధన్ రెడ్డి, గ్రామ సర్పంచ్ మల్లిఖార్జున్, ఎంపిటిసి వెంకటేశం, పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ మాధవి, జిల్లా సైన్స్ అధికారి భరణి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజయ, సైన్స్ ఉపాధ్యాయులు రామకృష్ణారెడ్డి, ఇన్ఫినిటీ విద్యా ఫౌండేషన్ ప్రతినిధి కృష్ణారెడ్డి, ఉపాధ్యాయులు, అధికారులు పాల్గొన్నారు.