Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజీవ్ స్వగృహ శ్రీ వల్లి టౌన్ షిప్లో
- రోడ్లు,విద్యుత్,డ్రైనేజీ సౌకర్యం సదుపాయాలు కల్పన
- 10 న రెండవ ప్రీ బిడ్ సమావేశం
- కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి
నవతెలంగాణ -నల్గొండ కలెక్టరేట్
నార్కట్ పల్లి మండలం ఎల్లారెడ్డి గూడ గ్రామం లో ఎం.జి.యూనివర్సిటీ ఎదురుగా హైవే వెంబడి ఉన్నరాజేష్ స్వగృహ శ్రీవల్లి టౌన్షిప్ లో ఓపెన్ ప్లాట్లు, పాక్షిక నిర్మాణ గృహాలకు మార్చి 16,17,18 తేదీ లలో 4వ విడత భౌతిక వేలం నిర్వహించనున్నట్లు కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఉదయాదిత్య భవన్ లో నాల్గవ విడత వేలం కు సంబంధించి మొదటి ప్రి బిడ్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రెండవ ప్రీ బిడ్ సమావేశం ఈ నెల 10 న నిర్వహించ నున్నట్లు తెలిపారు. మూడు విడతలుగా నిర్వహించిన వేలంలో ఔత్సాహిక ప్రజలు,ఉద్యోగుల నుండి మంచి స్పందన వచ్చిందని, పెద్ద సంఖ్యలో ఓపెన్ ప్లాట్ లు,పాక్షిక నిర్మాణ గృహాలు కొనుగోలు చేశారని ఆయన వెల్లడించారు.శ్రీ వల్లి టౌన్ షిప్ లో విద్యుత్ సౌకర్యం,రోడ్లు,డ్రైనేజీ వసతులు కల్పించనున్నట్లు,ఇప్పటికే ప్రభుత్వం 2 కోట్ల 70 లక్షలు మంజూరు చేసిందని, పనులు మొదలైనట్లు కలెక్టర్ వెల్లడించారు.నాల్గవ విడత నిర్వహించనున్న వేలంలో 253 పాక్షిక గృహాలను, 133 ఓపెన్ ప్లాట్లను భౌతిక వేలం ద్వారా విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఓపెన్ ప్లాట్లకు గజం 6000లు, పాక్షిక గృహాలకు నిర్మాణ దశను బట్టి 6000ల నుండి 10,500 రూ.ల వరకు కనిష్ట ధరను నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ఓపెన్ ప్లాట్సు, పాక్షిక గృహాలకు బ్యాంకు లోన్ సౌకర్యం ఉద్యోగులతో పాటు ఇతరులకు కూడా ఉన్నందున ఔత్సాహికలు అధిక సంఖ్యలో వేలంలో పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గతం లో వేలంలో పాల్గొని ప్లాట్లు దక్కించుకున్న వారు చెల్లింపులు పూర్తి చేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని కోరారు.పూర్తి వివరాలకు,టౌన్ సందర్శనకు రాజీవ్ స్వగృహ ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ సెల్ నంబర్ 9154339209 సంప్రదించ వచ్చని తెలిపారు.సమావేశంలో అదనపు కలెక్టర్లు కుషఉ్బ గుప్తా,భాస్కర్ రావు లు గృహ నిర్మాణ పి.డి. రాజ్ కుమార్,జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
ఏకో సెన్సిటివ్ జోన్ ఏర్పాటుకు ప్రతిపాదనలు
ఆమ్రా బాద్ టైగర్ రిజర్వ్ నాగార్జున సాగర్ వన్య ప్రాణి డివిజన్ చుట్టూ ఏకో సెన్సిటివ్ జోన్ ఏర్పాటు కు నోటిఫై చేసేందుకు ప్రతి పాదనలు కేంద్ర వన్య ప్రాణుల సంరక్షణ బోర్డ్ కు పంపించ నున్నట్లు జిల్లా కలెక్టర్ టి.వినరు క్రిష్ణా రెడ్డి తెలిపారు.మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో కలెక్టర్ అధ్యక్షతన అటవీ శాఖ,వివిధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన కమిటీ సమావేశంలో ఎకో సెన్సిటివ్ జోన్ ప్రతి పాధనల పై చర్చించి మాట్లాడారు. అనంతరండిఎఫ్ఓ రాంబాబు మాట్లాడుతూజాతీయ వన్య ప్రాణుల బోర్డ్ 21 జనవరి 2002 న నిర్వహించిన సమావేశం లో వన్య ప్రాణుల సంరక్షణ వ్యూహం 2002 రూపొందించినట్లు పర్యావరణ పరిరక్షణ చట్టం1986 సెక్ట్షన్ 3(ఙ), పర్యావరణ రక్షణ నిబంధనలు రూల్ 5 ననుసరించి జాతీయ పార్క్ లు,వన్య ప్రాణుల అభయారణ్యం ల పరిధి లో 10 కి.మీ పరిధిలో వచ్చే భూ భాగం ఏకో సెన్సిటివ్ జోన్ గా నోటిఫై చేయాలని పేర్కొన్నట్లు తెలిపారు.ఏకో సెన్సిటివ్ జోన్ లో మానవ నివా సిత పట్టణం లు,అభివృద్ధి పనులు చేపట్ట వలసి వున్నందున రాష్ట్రాల అభ్యర్థన మేరకు జాతీయ వన్య ప్రాణుల బోర్డ్ 27 మే2005 న ఎకో సెన్సిటివ్ జోన్ ఏర్పాటు,ప్రత్యేక కార్యకలాపాలు నియంత్రణకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.కేంద్ర పర్యావరణ,అటవీ శాఖ జాతీయ పార్క్ లు,వన్య ప్రాణుల అభయారణ్యం చుట్టూ ఎకో సెన్సిటివ్ జోన్ ఏర్పాటుకు 9 పిబ్రవరీ 2011 మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలిపారు.పై ఆదేశాలు కనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం 13 మార్చి 2012 న జిల్లా కలెక్టర్ ల అధ్యక్షతన జాతీయ పార్క్ లు,అభయారణ్యం లు చుట్టూ వన్య ప్రాణుల రక్షణ,అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహణకు అంచనా వేసి ఎంత మేర ఎకో సెన్సిటివ్ జోన్ ఏర్పాటు చేయాలి అన్న అంశం పై ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.2012 లో ఆగస్ట్ లో నాగార్జున సాగర్ డివిజనల్ అటవీ అధికారి కలెక్టర్ ఆధ్వర్యం లో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ చుట్టు 1 కి.మీ పరిధి వరకు ఏకో సెన్సిటివ్ జోన్ ఏర్పాటు కు ప్రతి పాదనలు రూపొందించినట్లు తెలిపారు. నాగార్జున సాగర్ వైల్డ్ లైఫ్ డివిజన్ కింద 1 కి.మీ పరిధి లో 36 గ్రామాలు వస్తాయని తెలిపారు. ఈ పరిధి లో ఏ కార్యకలాపాలు చేయవచ్చు,నిషేధం,నియంత్రణ పై కమిటీ చర్చించి 1 కి.మీ పరిధి లో ఏకో సెన్సిటివ్ జోన్ ఏర్పాటు కు ఆమోదం తెలిపినట్లు తెలిపారు. ఈ సమావేశం లో అదనపు కలెక్టర్ భాస్కరరావు, పరిశ్రమల శాఖ జియం.కోటేశ్వర రావు,వ్యవసాయ శాఖ జెడి.సుచరిత,గనుల శాఖ ఏడి. వెంకటేశ్వర్ రావు,ఎస్సి.కార్పొరేషన్ ఈడి.శ్రీనివాస్, డివిజన్ పంచాయతీ అధికారి లక్ష్మి నారాయణ,జిల్లా గిరిజన సంక్షేమ అధికారి రాజ్ కుమార్ పాల్గొన్నారు.