Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాటికీ ఇప్పటికీ సూర్యాపేట ఎంతో అభివృద్ధి చెందింది
- రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
పట్టణ ప్రజాప్రతినిధులు పట్టణ అభివృద్ధిలో భాగస్వాములై పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలని రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గుంటకండ్లజగదీశ్రెడ్డి అన్నారు.మంగళవారం స్థానిక రవి కన్వెన్షన్హాల్లో మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాండ్ల అన్నపూర్ణ అధ్యక్షతన నిర్వహించిన మున్సిపల్ బడ్జెట్ సమావేశంలో ఆయన మాట్లాడారు.సూర్యాపేట మున్సిపాలిటీ సొంతంగా నిధులు సమకూర్చుకొని అన్ని రంగాల్లో అభివృద్ధిలో ముందుకుసాగాలన్నారు.ప్రతి అభివృద్ధి పనికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలపై ఆధారపడకుండా సొంతంగా నిధులు సమకూర్చుకొని అభివృద్ధి పనులు నిర్వహించుకోవాలని సూచించారు.మున్సిపాలిటీకి రావాల్సిన పన్నుల విషయంలో ప్రజాప్రతినిధులు అధికారులకు సహకరించి పూర్తిస్థాయిలో పన్నులు వసూలు అయ్యేలా చూడాలన్నారు.మున్సిపల్ అధికారులు పన్నుల వసూళ్లకు పోయిన సమయంలో ప్రజాప్రతినిధులు ఎలాంటి ఫోన్లు చేయకుండా అవసరమైతే ఇంటి యజమానులతో పన్నులు కట్టించే ప్రయత్నం చేయాలన్నారు.పదేండ్ల కిందటికీ ఇప్పటికీ సూర్యాపేట పట్టణం ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు పట్టణంలో రెండు మినీ ట్యాంక్ బండ్లు, మెడికల్ కళాశాల, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ రాష్ట్రానికే తలమానికంగా సూర్యాపేట మారిందన్నారు.
142కోట్లా 2లక్షలా 25వేల రూపాయల బడ్జెట్‌కు కౌన్సిల్ ఆమోదం...
సూర్యాపేట మున్సిపాలిటీకి సంబంధించి 2022 - 23 సంవత్సర సవరణ అంచనా, 2023 -24 ఆర్థిక సంవత్సరానికి 142 కోట్లా 2 లక్షలా 25వేల రూపాయల బడ్జెట్‌ను మున్సిపల్ కౌన్సిల్ ఎదుట ప్రవేశపెట్టగా కౌన్సిల్ ఆమోదం తెలిపింది.మున్సిపల్ సాధారణ నిధుల కింద 39 కోట్ల 32 లక్షలు, గ్రాండ్ల రూపంలో రూ.98.20కోట్లు రావొచ్చని అంచనా వేయడం జరిగింది.ఇందులో వివిధ పన్నుల రూపంలో రూ.19.24కోట్లు, ఇతర పన్నులు అద్దెల ద్వారా 20 కోట్లా 8 లక్షలా25వేల రూపాయలు రుణాల ద్వారా 3కోట్లా 90 లక్షల రూపాయలు, నాన్‌ప్లాన్ నిధుల కింద రూ.19 కోట్లు, ప్లాన్ నిధుల ద్వారా రూ.14.30కోట్లు, ఇతర నిధులు రూ.65.50 కోట్లు మొత్తం 142 కోట్లా 2 లక్షలా 25వేల రూపాయలు రానున్నట్లు అంచనా వేశారు.ఈ బడ్జెట్ కింద సిబ్బంది వేతనాలకు 14 కోట్ల 50 లక్షలు, పట్టణంలో పారిశుధ్య నిర్వహణకు 4కోట్ల 66 లక్షలు, విద్యుత్ ఛార్జీల కింద 3కోట్ల 13 లక్షలు, రుణాల చెల్లింపుకు రెండు కోట్ల రూపాయలు, మున్సిపల్ గ్రీన్ బడ్జెట్ కింద 3కోట్ల 93 లక్షల ఇరవై మూడు వేల రూపాయలు, ఇంజనీరింగ్ విభాగం నిర్వహణకు రూ.4.26 కోట్లు, సాధారణ పరిపాలన వ్యయం కింద 168 లక్షలా 50 వేలరూపాయలు, పట్టణ ప్రాణాలిక విభాగం కోసం రూ.36 లక్షలు, చార్టెడ్ మొత్తం వ్యయం కింద 35 కోట్లా 2 లక్షలా 73వేల రూపాయలు చూపించారు.గతంలో మున్సిపల్ బ్యాలెన్స్ నిధులు రూ.1.60 కోట్లు, ప్రజల సౌకర్యాలకు రూ.77 లక్షలు, అభివృద్ధి పనుల కింద రెండు కోట్లా42 లక్షలా 52వేల రూపాయలు మొత్తం నాలుగు కోట్లా 79 లక్షలా 52వే రూపాయలు అభివృద్ధి వ్యయం కింద చూపించారు. 2023 - 24 ఖర్చు కింద మొత్తం రూ.39.32 కోట్లు, ప్రాధాన్య పరిపాలన నిర్వహణలో భాగంగా, గ్రాండ్ల రూపంలో వచ్చే అంచనా నిధులు కింద రూ.98.80 కోట్లను వివిధ అభివృద్ధి పనులు చేపట్టేందుకు అంచనా వేశారు.ఇట్టి బడ్జెట్‌ను కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది.అనంతరం జరిగిన కౌన్సిల్ సాధారణ సమావేశంలో మిగిలిన ఎజెండా అంశాలను కూడా ఆమోదించారు.ఈ సమావేశంలో కలెక్టర్ ఎస్.వెంకట్రావ్,అడిషినల్ కలెక్టర్ హేమంత్ కేశవ్‌పాటిల్, మున్సిపల్ కమిషనర్ పి.రామానుజులరెడ్డి,వైస్‌చైర్‌పర్సన్ పుట్టా కిశోర్, కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.