Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బడ్జెట్ ప్రతుల దహనం
నవతెలంగాణ -చిట్యాలటౌన్
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్సంపన్నుల ప్రయోజనాల కోసమే ఉన్నదని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బండ శ్రీ శైలం, సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్ విమర్శించారు. చిట్యాలలో మంగళవారం సీపీఐ(ఎం), రైతు సంఘం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడా పారిశ్రామిక వేత్తలకు అనుకూలంగా, పేద, మధ్యతరగతి ప్రజలపై మెయలేని బారాలు మెపారని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త బడ్జెట్ లో కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను పొందుపరిచారని అన్నారు. అధానీ, అంబానీ వంటి గుజరాత్ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా మోడీ విధానాలు ఉన్నాయని, ప్ర జా వ్యతిరేక బడ్జెట్ వల్లనే దేశ వ్యాప్తంగా సిపిఎం, రైతు సంఘాల ఆధ్వర్యంలో బడ్జెట్ పత్రాలను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులుఅవిశెట్టి శంకరయ్య,జిట్ట సరోజ, రూరల్ మండల కార్యదర్శి అరూరి శీను, రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఐతరాజు నర్సింహ, ఆ పార్టీ మండల నాయకులు నారబోయ్న శ్రీనివాసులు, రైతు సంఘం నాయకులు లడే రాములు, గుడిసె లక్ష్మి నారాయణ, కందుల అనిత, నాగమ్మ,కోనేటి యాదయ్య తదితరులు పాల్గొన్నారు.