Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేసీఆర్, కేటీఆర్ పై మాట్లాడితే నాలుక కోసి మోర్లేసి తొక్కుతాం
- మతపిచ్చి లేపుడు కాదు.. ధరలు తగ్గించడం కోసం పనిచేయండి
- తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్
నవతెలంగాణ-మోత్కూరు
దొంగలకు, లంగలకు దోచి పెట్టేందుకు, బ్యాంకులను, దేశాన్ని మోసం చేస్తున్న కార్పొరేట్లను మెప్పించేందుకు ప్రధాని మోడీ పేదలపై ధరల భారం మోపుతున్నారని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఖాళీ సిలిండర్లు, కట్టెల పొయ్యిలతో మహిళలతో కలిసి బుధవారం మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోని చెరువు కట్ట చౌరస్తాలో చేపట్టిన నిరసనలో బీఆర్ఎస్ యాదాద్రి జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకష్ణారెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని మోడీ ఎన్నికలగానే ధరలు పెంచకుండా ఎన్నికలు ముగిసిన వెంటనే నిరంకుశంగా వంట గ్యాన్, పెట్రోల్, డీజిల్ ధరలను విపరీతంగా పెంచి ప్రజలపై భారం మోపుతున్నారని, మోడీ ఎవరి మెప్పు కోసం పని చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్, కేటీఆర్, కవిత గురించి గుండు, అరగుండు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లాంటోడు ఎక్కువ మాట్లాడితే నాలుక కోసి మోర్లేసి తొక్కుతామని హెచ్చరించారు. దేశానికి దిక్చూచిలా తెలంగాణ రాష్ట్రం అభివద్ధిలో దూసుకుపోతుంటే కేంద్ర ప్రభుత్వం సహకరించకపోగా సీఎం కేసీఆర్ కాళ్లలో కట్టె పెట్టి అడ్డం పడుతుందన్నారు. ప్రధాని మోడీ అవలంబిస్తున్న నిరంకుశ విధానాలు తప్పని, కేంద్రం నిర్వహించాల్సిన విమానయాన, పోర్టులు, రైల్వేలు, ఎల్ ఐసీ, విద్యుత్, పెట్రోల్, గ్యాస్ వంటి సంస్థలను అదానీ, అంబానీలకు కట్టబెట్టడాన్ని ప్రజల ముందు పెట్టి ప్రశ్నిస్తే ఈడీ, సీబీఐ, ఐటీలను ఇళ్ల మీదకు పంపి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, అందుకు నిదర్శనంగా ఢిల్లీ ఉపముఖ్యమంత్రి సిసోడియా అరెస్ట కళ్ల ముందు కనిపిస్తోందన్నారు. తెలంగాణ అభివద్ధికి ఎందుకు సహకరించరని, దీనిపై గుండు, అరగుండు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఎంపీలు ఎందుకు ఒక్కనాడు కూడా మాట్లాడటం లేదని ప్రశ్నించారు. దీనిపై మాట్లాడితే కేసీఆర్, కేటీఆర్, కవితను అరెస్టు చేస్తామంటున్నారని, ప్రజలకు ఎవరేమి చేస్తున్నారో సోయి లేకుండా మాట్లాడుతున్న బండి సంజరు, అరవింద్, కిషన్ రెడ్డి మత నిచ్చి లేపి కేంద్రం మెప్పు పొందే ప్రయత్నం చేస్తున్నారని, ఇలాంటి పిచ్చి ప్రయత్నాలను మానుకుని గ్యాస్, పెట్రోల్ ధరలు తగ్గించే ప్రయత్నం చేయాలన్నారు. కేసీఆర్ పై పిచ్చి ప్రేలాపణలు వాగినా, తెలంగాణ ప్రజలను చిన్నచూపు చూసినా తెలంగాణ సాయుధ పోరాటం పునరావతమవుతుందని, ప్రజలు బట్టలూడదీసి ఉరికిచ్చి కొట్టే చరిత్ర కళ్ల ముందు కనిపిస్తుందంటూ జాగ్రత్త అని హెచ్చరించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల, మున్సిపాలిటీ అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు పొన్నెబోయిన రమేష్, బొడ్డుపల్లి కల్యాణ్ చక్రవర్తి, గజ్జి మల్లేష్, ఎంపీపీ రచ్చకల్పనలక్ష్మీ నర్సింహారెడ్డి, జడ్పీటీసీ గోరుపల్లి శారదసంతోష్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ కొణతం యాకూబ్ రెడ్డి, సింగిలివిండో చైర్మన్ కంచర్ల అశోక్ రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు కొండా సోంమల్లు, మదర్ డెయిరీ డైరెక్టర్ రచ్చ లక్ష్మీ నర్సింహారెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రాంపాక నాగయ్య పాల్గొన్నారు.
భువనగిరిరూరల్ : గ్యాస్ సిలిండర్ ధరను పెంచడాన్ని నిరసిస్తూ మండలంలోని తాజ్పూర్్ గ్రామంలో గురువారం సర్పంచ్ బొమ్మరపు సురేష్, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు ర్యాకల శ్రీనివాస్ ఆధ్వర్యంలో మహిళలు పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం రహదారిపై నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కేంద్రం ప్రభుత్వం గ్యాస్ ధరలు పెంచి నిరుపేదల బతుకులతో ఆటలాడుతుందని మండిపడ్డారు. గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించేంత వరకు ఉద్యమం ఆగేదిలేదని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ర్యాకల సంతోష, వార్డు సభ్యులు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు,మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
కేంద్రం పెంచిన వంటగ్యాస్ ధరలకు నిరసనగా ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి పిలుపు మేరకు గురువారం వడాయిగూడెం సర్పంచ్ గుండు మనీష్ గౌడ్, బీఆర్ ఎస్ గ్రామశాఖ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో వడాయిగూడెం కమాన్ వద్ద కట్టెల పొయ్యిపై వంటచేస్తూ నిరసన వ్యక్తం చేశారు. కో ఆప్షన్ సభ్యురాలు ఎశబోయిన లక్ష్మీ శ్రీశైలం యాదవ్ నాయకత్వంలో మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ విభాగం అధ్యక్షుడు కోట చంద్రశేఖర్ , ఉప సర్పంచ్ నీల పోశెట్టి గౌడ్, వార్డు సభ్యులు బబ్బూరి సాగర్ గౌడ్, పబ్బాల రమేష్ , పబ్బాల మాధవి, కోటస్వామి దాస్, నాయకులు శెట్టి గోపాల్ యాదవ్, చుక్కల మల్లయ్య యాదవ్, గుండు రవి గౌడ్, నోముల నర్సింహ్మ యాదవ్, కోట లక్ష్మయ్య, కోట అంజనేయులు , బబ్బూరి అంజమ్మ, నీల భారతమ్మ, శెట్టి హేమలత, బబ్బూరి గీత లు పాల్గన్నారు.
రాజాపేట: కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని కోరుతూ బీఆర్ఎస్ మండల అధ్యక్షులు నాగిర్తి రాజిరెడ్డి మహిళా అధ్యక్షురాలు ఎడ్ల బాలలక్ష్మి ఆధ్వర్యంలో గురువారం మండలకేంద్రంలో ధర్నా నిర్వహించారు. మోడీ బొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో రాజాపేట మండల ఎంపీపీ గోపగాని బాలమణి యాదగిరి గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కాల సుమలత, ఉప్పలయ్య, మదర్ డైరీ డైరెక్టర్ అర్కాల గాల్ రెడ్డి , మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాపోలు లక్ష్మారెడ్డి మాజీ జడ్పిటిసి జిల్లా బిక్షపతి గౌడ్ మండల పార్టీ అధికార ప్రతినిధి సట్టు తిరుమలేష్ రాజపేట టౌన్ అధ్యక్షులు బెడుదే వీరేశం మండల పార్టీ యువజన అధ్యక్షులు పల్లె సంతోష్ గౌడ్ ,మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గుర్రం నరసింహ, పీఏసీస్ వైస్ చైర్మెన్ కాకల్ల ఉపేందర్, సర్పంచులు,తదితరులు పాల్గొన్నారు.
భువనగిరి: కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలని సీపీిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దేశాల అశోక్ డిమాండ్ చేశారు. గురువారం కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరలను తగ్గించాలని ఆ పార్టీ ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు అనంతరం డిప్యూటీ తహాసిల్దార్‌కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఏశాల అశోక్, మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు సోమన సబిత , పార్టీ మండల సహాయ కార్యదర్శి గుండ్ల లక్ష్మయ్య సిపిఐ భువనగిరి పట్టణ కార్యదర్శి పుట్ట రమేష్, సహాయ కార్యదర్శి చింతల మల్లేశం, చిక్క నరసయ్య పాల్గొన్నారు.
.పీసీసీ, డిసిసి పిలుపుమేరకు పెంచిన వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాదాసు గోవర్ధన్ ఆధ్వర్యంలో స్థానిక ప్రిన్స్ చౌరస్తా వద్ద గ్యాస్ సిలిండర్లకు పూలదండలు వేసి నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ పోత్నాక్ ప్రమోద్ కుమార్, పీసీసీ డెలిగేట్ తంగళ్ళపల్లి రవికుమార్, మున్సిపల్ మాజీ చైర్మెన్ బర్రె జహంగీర్, నాయకులు ఎండి.మజార్, ఎండి.అవైస్ చిస్తి, పిట్టల బాలరాజ్, అంగడి నాగరాజ్ ,ఎండి ఆబిద్ అలీ, బెండ శ్రీకాంత్ కూర వెంకటేష్, తాడూరి నరసింహ, డాకూరి ప్రకాష్, ధర్మారెడ్డి పోకల యాదగిరి, సుధాకర్, గుమ్మడిల్లి రమేష్, మనోజ్ పాల్గొన్నారు.
ఆలేరుటౌన్ : అన్ని రకాల నిత్యావసరాల ధరలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజలను అందిస్తుందని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేశం, మాజీ జెడ్పీటీసీి సభ్యులు బొట్ల పరమేశ్వర్ అన్నారు. మండల కేంద్రంలో గురువారం బస్టాండ్ చౌరస్తా ఆవరణలో కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధర నిరసిస్తూ నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘం వైస్ చైర్మన్ మొ రిగాడి మాధవి వెంకటేష్, పిఎసిఎస్ అధ్యక్షులు మొగలగాని మల్లేశం, గ్రంధాలయాల జిల్లా డైరెక్టర్ ఆడే బాలస్వామి, వార్డు కౌన్సిలర్ బేతి రాములు, గంగుల శ్రీనివాస్ , మాదాని పుష్పాపిలిపు, క్యాసగల్ల అనసూయ , సీస మహేశ్వరి , మొరిగాడి ఇందిర ,మంతపురి ఇంచార్జి సర్పంచ్, యాట విజయ ,చిమ్మి భాగ్య ,పాము సువర్ణ ,ఆలేటి అరుణ ,గొల్లు భాగ్య, జూకంటి ఉప్పలయ్య , పూల శ్రావణ్, అన్ని విభాగాల నాయకులు ,కార్యకర్తలు , మహిళలు తదితరులు పాల్గొన్నారు.
మండల కేంద్రంలో గురువారం సీపీిఐ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పెరిగిన గ్యాస్ ధర నిరసిస్తూ తాసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.అనంతరం తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు చెక్క వెంకటేష్,మాటూరి జానమ్మ ,నల్ల అందాలు, రాజారెడ్డి, కళ్యాణి, జంగ సరళ, పూలమ్మ ,లక్ష్మి, విజయ, కనకమ్మ, అలిమ బేగం తదితరులు పాల్గొన్నారు.
అడ్డగుడూర్ : బీజేపీ ప్రభుత్వం సామాన్యుల నడ్డి విరిచే విధంగా అడ్డగోలుగా పెంచిన వంట గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా గురువారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టి కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ దర్శనాల అంజయ్య , జెడ్పిటిసి శ్రీరాముల జ్యోతి అయోధ్య , బీఆర్ఎస్. మండల అధ్యక్షులు కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి , ప్రధాన కార్యదర్శి చౌగోని సత్యం గౌడ్, పి.ఏ.సి.ఎస్ ఛైర్మెన్ పొన్నాల వెంకటేశ్వర్లు , స్థానిక సర్పంచ్ బాలెంల త్రివేణి , వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు, ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు,మహిళలు , బీఆర్ఎస్ట్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
రామన్నపేట : భారతదేశాన్ని పాలిస్తున్న ఓ మోడీ గారు పేద ప్రజలను బతకనివ్వరా... గ్యాస్, పెట్రోల్, డీజిల్ చెమురు, ఇతర నిత్యవసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచడంతోపాటు జీఎస్టీని విధించి పేద ప్రజల బతుకులతో ఆటలాడుకుంటూ వారి జీవితాలను ఆగం చేస్తున్నావ్ అని బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మందడి ఉదరు రెడ్డి విమర్శించారు. పెంచిన గ్యాస్, నిత్యవసర వస్తువుల ధరల పెరుగుదలకు నిరసనగా బిఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు గురువారం మండల కేంద్రంలోని సుభాష్ సెంటర్ లో భువనగిరి రోడ్డుపై బైఠాయించి ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కన్నెబోయిన జ్యోతి, పిఎసిఎస్ చైర్మన్ నంద్యాల బిక్షం రెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ కంభంపాటి శ్రీనివాస్, రైతుబంధు అధ్యక్షులు బొక్క మాధవరెడ్డి టిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి పోష బోయిన మల్లేశం, బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు పోతరాజు సాయి కుమార్, వివిధ గ్రామాల సర్పంచులు అప్పం లక్ష్మీనర్సు, గుద్ధ నరసింహారెడ్డి, కోళ్ల స్వామి, మెట్టు మహేందర్ రెడ్డి, ఎంపీటీసీలు దోమల సతీష్, ఎండి అమేర్, నాయకులు పున్న జగన్మోహన్, నీల దయాకర్, అంతటి రమేష్ బద్దుల రమేష్, కూనూరు ముత్తయ్య, పున్న వెంకటేశం, పోలేబోయిన నరసింహ, గోగు సత్యనారాయణ, కన్నెబోయిన ఐలయ్య, తదితరులు పాల్గొన్నారు.
బొమ్మలరామారం : కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరను పెంచడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మండలకేంద్రంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు మన్నే శ్రీధర్, మార్కెట్ వైస్ చైర్మన్ సత్యనారాయణ, మండల కార్యదర్శి శ్రీకాంత్, ఉప సర్పంచ్ భరత్,యువజన విభాగ జనరల్ సెక్రెటరీ మెగావత్ జైపాల్, గ్రామశాఖ అధ్యక్షులు ఉపేందర్, సర్పంచ్ రాంరెడ్డి, నాయకులు బండి మహేష్, బేతాళ పాండు పాపిరెడ్డి ,కూర వెంకటేశం, జంగర్ల సంకర్య,రవి , తదితరులు పాల్గొన్నారు.