Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మోత్కూర్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గత తొమ్మిదేళ్లుగా వంట గ్యాస్ సిలిండర్ ధరలను పెంచి సామాన్య ప్రజలపై మోయలేని భారం వేసిందని, వెంటనే పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను ఉపసంహరించుకోవాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు బొల్లు యాదగిరి డిమాండ్ చేశారు. బుధవారం మోత్కూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ 2014 లో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు సిలిండర్ ధర రూ.400 ఉందని, ఇప్పుడు మూడింతలు పెరిగి రూ.1170 అయ్యిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆదానీ, అంబానీ లాంటి కార్పొరేట్లకు దోచిపెట్టే చర్యలను మానుకొని పేదలపై ధరల భారం తగ్గించాలని, వెంటనే వంటగ్యాస్ పై పెంచిన ధరలను ఉపసంహరించుకొని సబ్సిడీలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. నేడు మండల కేంద్రాల్లో, గ్రామాలలో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఆ పార్టీ మండల కార్యదర్శి గుండు వెంకటనర్సు, జిల్లా కమిటీ సభ్యులు రాచకొండ రాములమ్మ, కందుకూరి నర్సింహ పాల్గొన్నారు.