Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - భువనగిరి
సంగు రవీందర్ ఆశయం కోసం ఉద్యమాలు చేస్తామని సీపీఐ(ఎకం) రాష్టకమిటీ సభ్యురాలు బట్టుపల్లిఅనురాధ అన్నారు. సంగు రవీందర్ 8వ వర్థంతి సందర్భంగా స్థానిక సుందరయ్య భవనంలో ఆయన చిత్రపటానికి పూలమలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీపీఐ(ఎం) బలోపేతం చేయడానికి ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ ,సిఐటియు పలు సంఘాల్లో పనిచేస్తూ పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు, పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ, పట్టణ నాయకులు గద్దె నరసింహ, ఇస్మాయిల్, గంధమల్ల మాతయ్య, బందెల ఎల్లయ్య, వల్లాస్ అంజయ్య, చింతల శివ, కోటగిరి వీరబ్రహ్మం, పోకల దయానంద్, వనం గిరి, బండారు, శంకర్, ఆఫీస్ కార్యదర్శి వడ్డబోయిన వెంకటేష్ పాల్గొన్నారు.