Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ మునుగోడు నియోజకవర్గ ఇన్చార్జి పాల్వాయి స్రవంతి
నవతెలంగాణ -సంస్థాన్ నారాయణపురం
ఉప ఎన్నికల ముందు తవ్వి వదిలేసిన రోడ్లు పూర్తి కావాలంటే మళ్ళీ ఎన్నికలు రావాలా? అని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పాల్వాయి స్రవంతి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.గురువారం మండలములోని జనగాం గ్రామంలో పూర్తి చేయకుండా తవ్వి వదిలేసిన రోడ్లను పరిశీలించారు.ఈ రోడ్డును పూర్తి చేయకపోవడం వల్ల రోడ్డుకు ఇరువైపులా ఉన్న దుకాణం దారిలు,ప్రజలు దుమ్ము ధూళితో ఇబ్బందులు పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి వచ్చిన రాష్ట్ర మంత్రి కేటీఆర్ మునుగోడు ను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించి అభివృద్ధి విషయంలో వివక్ష చూపడం సరికాదన్నారు.మండలంలోని జనగాం వాయిల్లపళ్లి గ్రామం వరకు గుంతలు పడిన ఆర్ అండ్ బి రోడ్డు మరమ్మతు చేసేందుకు తొవ్వి పూర్తి చేయకుండా వదిలేయడం వల్ల ప్రజలు మరింత ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఆమె వెంట ఆ పార్టీ నాయకులు గడ్డం మురళీధర్ రెడ్డి, ఐ ఎన్ టీ యూ సీ నియోజకవర్గ అధ్యక్షులు ఎస్కే బడే సాబ్, మాజీ సర్పంచ్ గడ్డం శంకరయ్య, గ్రామ శాఖ అధ్యక్షులు గడ్డం రవి, నరేందర్ తదితరులు ఉన్నారు.