Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి. జహంగీర్
నవతెలంగాణ - భువనగిరి
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం గ్యాస్ ధరను పెంచి మరొక్కసారి సామాన్యుల మీద ధరల భారాన్ని మోపిందని పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరతో సామాన్యులు జీవనం సాగించే పరిస్థితి లేదని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి. జహంగీర్ అన్నారు. పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని పెరిగిన గ్యాస్ ధరలు నిరసిస్తూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో గ్రామీణ స్థాయిలో మండల కేంద్రాలలో నిరసనలు చేపడతామని తెలిపారు. గురువారం స్థానిక ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యవసర సరుకుల ధరలు పెట్రోల,్ డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెంచుతూ పేదవారి నడ్డి విరిసే విధంగా పరిపాలన సాగిస్తుందని విమర్శించారు. గతంలో సిలిండర్ ధర రూ.1105 ఉంటే పెరిగిన 50 రూపాయల సిలిండర్ ధరతో ప్రస్తుతం రూ 1150 పెట్టి సిలిండర్ కొనుగోలు చేసే పరిస్థితి వచ్చిందన్నారు. సామాన్య కుటుంబం ధరల పెరుగుదలతో జీవనం ఎలా సాగిస్తారన్నారు. బీజేపీ ప్రభుత్వానికి పేద మధ్యతరగతి ప్రజల జీవన పరిస్థితులు పట్టవన్నారు. వెంటనే పెంచిన గ్యాస్ ధరను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. నేడు సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో గ్రామీణ మండల స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు బట్టుపల్లి అనురాధ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు, దాసరి పాండు పాల్గొన్నారు.