Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చిలుకూరు
పేదలందరికీ డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ములకలపల్లి రాములు అన్నారు. గురువారం మండలంలోని మాధవ గూడెం గ్రామంలో వ్యవసాయ కార్మిక సంఘం సభ్యత్వ క్యాంపియన్ ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ కెసిఆర్ ప్రభుత్వం తన ఎన్నికల వాగ్దానంలో ఇచ్చిన పేదలందరికీ డబల్ బెడ్ రూమ్ ఇల్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని కొన్ని గ్రామాలలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మాణం చేసి నేటి వరకు పంపిణీ చేయడంలో కేసీఆర్ ప్రభుత్వం విప్లమైందన్నారు కేసీఆర్ ప్రభుత్వం డబల్ బెడ్ రూమ్ ఇళ్లను పంపిణీ చేయకపోతే వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పంపిణీ చేస్తామని హెచ్చరించారు. మోడీ విధానం వలన ప్రజలపై అనేక భారం పడుతుందన్నారు పెరిగిన ధరలతో సామాన్యులు బతకలేని స్థితిలో ఉన్నారన్నారు కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని లేనిపక్షంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు నారసాని వెంకటేశ్వర్లు, మాదాసు ఈదయ్య, తమలపాకుల అర్జున్, కత్తి ముత్తమ్మా తదితరులు పాల్గొన్నారు.