Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జెడ్పీటీసీ డాక్టర్ కొప్పుల సైదిరెడ్డి
నవతెలంగాణ-హుజూర్‌నగర్‌రూరల్
రేపటి తరానికి మార్గదర్శకులే నేటి విద్యార్థులని జెడ్పీటీసీ డాక్టర్ కొప్పుల సైదిరెడ్డి, గ్రామ సర్పంచ్ సుజాత అంజిరెడ్డి అన్నారు. ఎంపీపీఎస్ అమరవరం పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా జెడ్పీటీసీ డాక్టర్ కొప్పుల సైదిరెడ్డి, గ్రామ సర్పంచ్ సుజాత అంజిరెడ్డి హాజరై మాట్లాడారు. రేపటి భవిష్యత్తుకు మార్గదర్శకులు నేటి విద్యార్థులే అని తెలియజేశారు. విద్యార్థులు ఈ స్థాయి నుండి అనైకమైనటువంటి నైపుణ్యాలను నేర్చుకోవాలని వినూత్న కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌గా తోట నవ్యశ్రీ, జిల్లా విద్యాశాఖ అధికారిగా నవీన్, మండల విద్యాధికారిగా మహేశ్వరి, ప్రధానోపాధ్యాయులుగా కావ్య, వారి పాత్రలను పోషించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మామిళ్ళ శ్రీనివాస్‌రెడ్డి, పాఠశాల యాజమాన్య కమిటీ చైర్పర్సన్ రమేష్, ఉపాధ్యాయులు బొప్పని విజరుకుమార్, కాచవరపు పురుషోత్తమరావు, ముక్కా సోమశేఖర్, పీి. వెంకటరమణరావు, షేక్ సైదాబీ, సీఆర్పీ సైదులు, ఎల్డిఏ హలీం, మేసెంజర్, జయరాజు పాల్గొన్నారు.