Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భవిష్యత్తు అంతా వృత్తి విద్య కోర్సులదే
- డీఎస్పీ నాగభూషణం
నవతెలంగాణ -సూర్యాపేటకలెక్టరేట్
క్రమశిక్షణ గల విద్యతోనే విద్యార్థులు సమాజంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారని సూర్యాపేట డీఎస్పీ నాగభూషణం అన్నారు.గురువారం స్థానిక పబ్లిక్ క్లబ్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన లక్ష్మీ వెంకట సాయి వోకేషనల్ కళాశాల నాలుగవ వార్షికోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.ప్రస్తుతం డాక్టర్ ఇంజనీరింగ్ కోర్సుల కంటే వృత్తి విద్య కోర్సులకు ఆదరణ ఎక్కువగా ఉందని వృత్తి విద్య కోర్సులు పూర్తిచేస్తే జీవితంలో ఎలాగైనా నిలదొక్కుకోవచ్చని అన్నారు. విద్యార్థులు జీవితంలో లక్ష్యాన్ని ఎంచుకొని కష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని అన్నారు.జిల్లా ఇంటర్మీడియట్ అధికారి కృష్ణయ్య మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదివి తల్లిదండ్రులకు కళాశాలకు మంచి పేరు తీసుకురావాలన్నారు.కళాశాల కరస్పాండెంట్ బాల గౌడ్ మాట్లాడుతూ తమ కళాశాల ఆధ్వర్యంలో విద్యార్థులకు క్రమశిక్షణ గల విద్యను అందిస్తూ ఎప్పటికప్పుడు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నట్లు తెలిపారు.విద్యార్థులు బాగా చదివి రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో ర్యాంకులు తెచ్చుకుంటే కళాశాల తరఫున నగదు బహుమానము అందిస్తానని ప్రకటించారు.అనంతరం రాష్ట్రస్థాయిలో ర్యాంకులు సాధించిన ముగ్గురు విద్యార్థులకు 10,000 చొప్పున నగదు సహాయాన్న అందజేశారు.ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆలరించాయి. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ రామ్మూర్తి యాదవ్, కళాశాల చైర్మన్ విజయలక్ష్మి, ప్రిన్సిపల్ కళ్యాణి, డిఈసి మెంబర్లు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.