Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి
నవతెలంగాణ-సూర్యాపేట
కేంద్ర ప్రభుత్వం ఇష్టానుసారం పెంచిన వంట గ్యాస్ ధరను వెంటనే ఉపసంహరించు కోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ పై పెంచిన రూ. 50 రూపాయలను ఉపసంహరించు కోవాలని డిమాండ్ చేస్తూ గురువారం స్థానిక వాణిజ్య భవన్ సెంటర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఎనిమిదేళ్ల క్రితం రూ. 400 ఉన్న వంట గ్యాస్ సిలిండర్ ధరను రోజురోజుకు పెంచడం మూలంగా పేద, మధ్యతరగతి ప్రజలపై మోయలేని భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాల మూలంగా వంట గ్యాస్ ధర రూ. 1176.50లకు పెరిగిందన్నారు. దేశంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీ విధానం చూస్తుంటే మహిళలను మళ్లీ కట్టెల పొయ్యి పై వంట చేసి కన్నీరు తెచ్చేలా ఉందన్నారు. జిల్లాలో మూడున్నర లక్షల పైగా ఉన్న వినియోగదారులపై 55 లక్షల అదనపు భారం పడుతుందన్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ విధానాల మూలంగా పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరగడంతో మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా పేద, మధ్యతరగతి ప్రజలపై వంటగ్యాస్ భారం పడటంతో పెరిగిన ధరలతో ప్రజలు తల్లడిల్లుతున్నారని పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ఇచ్చే బహుమానం ఇదేనా అని మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా మన భారతదేశంలో అధిక ధర కు వంట గ్యాస్ ధర పెంచడం సిగ్గుచేటని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన వంటగ్యాస్ ధర తగ్గించే వరకు ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఆమె హెచ్చరించారు. అంతకు ముందు సీపీఐ(ఎం) జిల్లా కార్యాలయం నుండి వాణిజ్య భవన్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి ,జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, మట్టి పెళ్లి సైదులు, కోట గోపి, జిల్లా కమిటీ సభ్యులు ఎల్గూరి గోవింద్, వేల్పుల వెంకన్న, మద్దెల జ్యోతి ,పులుసు సత్యం ,వీరబోయిన రవి ,ప్రజా సంఘాల జిల్లా నాయకులు రాంబాబు, మందడి రామ్ రెడ్డి ,వల్లపు దాసు సాయికుమార్ ,సాన బోయిన ఉపేందర్ ,అర్వపల్లి లింగయ్య, వజ్జ శ్రీనివాస్, షేక్ జహంగీర్ ,కొండేటి ఉపేందర్, ఎరుకల సైదులు, నాగరాజు, చిత్రం భద్రమ్మ ,నల్ల మేకల అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
వంట గ్యాస్ ధర పెంచిన కేంద్రంపై భగ్గు మన్న బీఆర్ఎస్ మహిళలు,
కథం తొక్కిన మహిళలు,
పెరిగిన గ్యాస్ ధరలపై తెలంగాణ మహిళలు ఆందోళన బాట పట్టారు. కేంద్రప్రభుత్వం విధానాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపుతో పాటు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష రెడ్డి ఆదేశాల మేరకు బీఆర్ఎస్ మహిళా విభాగం నేతలు గురువారం సూర్యాపేటలో భారీ నిరసన చేపట్టారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజ్ నుండి మొదలైన మహిళల నిరసన ప్రదర్శన శంకర్ విలాస్,యం జి రోడ్,తెలంగాణా తల్లి విగ్రహం మీదుగా కొత్త బస్ స్టాండ్ వద్దకు చేరుకుంది.పెంచిన గ్యాస్,ధరల కు నిరసనగా కట్టెల పొయి పై వంట చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం మున్సిపల్ చైర్మెన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యావసర ధరలను పెంచుతూ సామాన్య ప్రజల నడ్డి విరుస్తుందని మండిపడ్డారు.మహిళలు రోజూ వినియోగించే గ్యాస్ ధరను ఒక్కరోజులో రూ.50కి పెంచడం సరికాదన్నారు.ఈ కార్యక్రమంలో మహిళా ప్రజాప్రతినిధులు, వార్డు కౌన్సిలర్లు, టిఆర్ఎస్ పార్టీ మహిళ నాయకురాలు తదితరులు పాల్గొన్నారు.
ఆత్మకూరు ఎస్ :కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధరలను అమాంతంగా గృహ వినియోదారులకు 50 కమర్షియల్ 350 లకు పెంచడానికి వ్యతిరేకిస్తూ సీపీఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పి ఓ డబ్ల్యు పి వై ఎల్ ఆధ్వర్యంలో మండల పరిధిలోని తుమ్మల పెన్పడు గ్రామం లో నిరసన తెలిపారు..ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా నాయకులు అలుగువెల్లి వెంక రెడ్డి ,పి ఓ డబ్ల్యు జిల్లా కార్యదర్శి కంచర్ల నర్సక్క, పి వై ఎల్ జిల్లా అధ్యక్షులు నల్లగొండ నాగయ్య మండల కార్యదర్శి కలం చర్ల శ్రీను,తదితరులు పాల్గొన్నారు.
హుజూర్ నగర్టౌన్: కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు శీలం శ్రీను డిమాండ్ చేశారు. గురువారం స్థానికంగా సీఐటీయూ ఆధ్వర్యంలో ప్రధాన రహదారిపై వంటగ్యాస్, ఖాళీ సిలిండర్లతో బైటాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రజలపై పన్నుల బారాల మోపుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. రూ. 400 లు ఉన్న గ్యాస్ ధరను రూ.1255లకు పెంచి వంట గ్యాస్‌ను పేదలకు దూరం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పిట్టల నాగేశ్వరావు, శీలం వెంకన్న , బత్తిని అక్కమ్మ, దాసరి సుభద్ర, శీలం సావిత్రి, చాగంటి ప్రమీల, సవడం నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.
పెన్‌పహాడ్:కేంద్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా పెంచిన వంట గ్యాస్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీిఐ(ఎం) మండల కార్యదర్శి రణపంగ కృష్ణ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో గురువారం ఆ పార్టీ ఆధ్వర్యంలో ఖాలి గ్యాస్ సిలిండర్‌తో నిరసన తెలియచేశారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి గుంజ వెంకటేశ్వర్లు, నాయకులు వెంకన్న, ఏలియా, పుష్ప, మైసయ్య, రంగయ్య, రవి, లింగయ్య, తదితరులు పాల్గొన్నారు.
హుజుర్నగర్ రూరల్ :పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలి అని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు దుగ్గి బ్రహ్మం అన్నారు. గురువారం హుజూర్నగర్ పట్టణం లోని 10వ వార్డులో దుగ్గి అన్నపూర్ణ, ఇందిరాల సురేఖ ఆధ్వర్యంలో గ్యాస్ ధరల పెంపునకు నిరసనగా నిర్యహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఇందిరాల పుల్లమ్మ, సావిత్రమ్మ, అమరబోయిన వెంకటమ్మ, పచిపాల వెంకట్రాములు, దేవరం బద్రమ, దుగ్గి వెంకటమ్మ, రేణుక, కల్పన, కామ్మగారు, హస్సేనమ్మ, ఇందిరాల కలావతి, కుమారి, వెంకటయ్య, విజయ లక్ష్మి, గూడేపు ప్రభావతి, దుర్గమ్మ, ప్రియాంక, సైదమ్మ పాల్గొన్నారు.
హుజూర్నగర్ మండలం శ్రీనివాసపురం గ్రామంలో నిరసనగా కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరను వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఐ(ఎం) హుజూర్నగర్ మండల కార్యదర్శి పోసనబోయిన హుస్సేన్ డిమాండ్ చేశారు. గురువారం సీపీఎం మండల కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్‌పై పెంచిన రూ.50లను ఉపసంహరించుకోవాలని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు తంగేళ్ల వెంకటచంద్ర, నూకల లక్ష్మీనరసమ్మ, శాఖ కార్యదర్శి మాడూరి నరసింహాచారి, తంగిళ్ళ గోపరాజు, శాఖమూడి శశికళ, నూకల శేషమ్మ, బంగారు, నరసమమ అన్నపూర్ణ, నూకల వెంకటమ్మ,సైదమ్మ, భద్రమ్మ, నూకల అంజయ్య పాల్గొన్నారు.