Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- నేరేడుచర్ల
సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు నందమూరి కోటేశ్వరావు బుధవారం పెంచికల్ దిన్న గ్రామంలో అనారోగ్యంతో మృతి చెందారు. గురువారం ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ,మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి , ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిమల్లు లక్ష్మి ఆయన పార్థివ దేహం పై పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నందమూరి కోటేశ్వరావు మొదటి నుండి కమ్యూనిస్టుగానే ఉంటూ 1970-80 దశకంలో పెంచికల్ దిన్న గ్రామ సర్పంచ్ గా పనిచేశారని, ఆయన కడదాకా కమ్యూనిస్టుగా బతికారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి కొలిశెట్టి యాదగిరిరావు, నెమ్మది వెంకటేశ్వర్లు, కోట గోపి, అనంత ప్రకాష్, కొదమగుండ్ల నగేష్, సిరికొండ శ్రీను, అల్వాల శ్రీధర్, నందమూరి బాబురావు, అరి బండి ప్రసాద్ రావు, గంగారాధమ్మ, సత్యవతి, బొప్పన రానమ్మ, రాములమ్మ తదితర సిపిఎం నాయకులు సానుభూతిపరులు పాల్గొన్నారు.