Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్పీ రాజేంద్రప్రసాద్
నవతెలంగాణ-సూర్యాపేట
ప్రమాద సమయంలో గుండె కొట్టుకోవడం స్తంభించినప్పుడు లేదా ఊపిరితిత్తులు శ్వాస తీసుకోని స్థితిలో ఉన్ననప్పుడు వారి ప్రాణాలు కాపాడడానికి హృదయశ్వాసకోశ పునరుజ్జీవన చర్య అనేది చాలా ఉపయోగపడుతుందని ఎస్పీ రాజేంద్రప్రసాద్ అన్నారు .హృదయశ్వాసకోశ పునరుజ్జీవన చర్య కార్డియోపల్మోనరీ రిససిటేషన్( సీపీఆర్) పై రాష్ట్ర రోడ్డు సేఫ్టీ విభాగం,జివికె సంస్థ అత్యవసర విభాగం వారి అధ్వర్యంలో గురువారం స్థానిక యస్వీ డిగ్రీ కళాశాల లో పోలీసు సిబ్బందికి, విద్యార్థులకు నిర్వహించిన శిక్షణ లో ఆయన మాట్లాడారు.ఇది విద్యుత్ షాక్, నీటిలో మునిగినప్పుడు, రోడ్డు ప్రమాదాల బారిన పడ్డప్పుడు, అకస్మాత్తుగా స్పూహ కోల్పోయినప్పుడు శ్వాస తీసుకోలేక గుండె అగిన సందర్భాల్లో అప్పటికపుడు అత్యవసరంగా వెంటనే ఛాతీ మధ్యలో పలుమార్లు బలంగా నొక్కడం వల్ల ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందని వివరించారు. ప్రధమ చికిత్సతో పాటుగా ఈ రకమైన సీపీఆర్ విధానం పై కూడా సిబ్బంది అవగాహన కలిగి ఉండాలని ఆయన కోరారు. రెండు రోజుల క్రితం ఈ విధంగా చేసి ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ ఒక వ్యక్తి ప్రాణాలను కాపాడాడని ఎస్పీ ఈ సందర్భంగా గుర్తు చేశారు.సామాజిక మాధ్యమాల్లో కానిస్టేబుల్కు చాలా ప్రశంశలు వచ్చాయని తెలిపారు. ప్రమాద ఘటనలో ప్రతిక్షణం అత్యవసరమైనదేనని అత్యంత వేగంగా స్పందించి ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదని పేర్కొన్నారు. జిల్లా పోలీసు సిబ్బంది అందరికీ ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పారు. శ్రద్ధగా శిక్షణ పై నైపుణ్యం తెచ్చుకొని అత్యవసర సమయాల్లో ప్రమాదంలో ఉన్న ప్రజలను కాపాడాలని కోరారు.ఎంతో ఉపయోగ కరమైన ఇలాంటి శిక్షణను అందించిన వచ్చిన రాష్ట్ర రోడ్డు సేఫ్టీ పోలీస్ విభాగం, జీవీ ఎమర్జెన్సీ విభాగం వారికి ఎస్పీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పోలీసు రోడ్ సేఫ్టీ డీిఎస్పీ చంద్రబాను, సూర్యాపేట సబ్ డివిజన్ డిఎస్పీ నాగభూషణం,జి.వి.కె ఎమర్జెన్సీ సంస్థ డాక్టర్ మధుసూధన్,ఎసై లు విష్ణు మూర్తి, శ్రీకాంత్, నరేష్, సిబ్బంది పాల్గొన్నారు.