Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) ఖండన
నవతెలంగాణ-నల్లగొండ
పట్టణంలోని 11వ వార్డు ఇందిరమ్మ కాలనీలో పేదల నిర్మించుకుంటున్న బేస్మెంట్లను మున్సిపల్, రెవెన్యూ అధికారులు అక్రమంగా కూల్చివేయడాన్ని సీపీఐ(ఎం) తీవ్రంగా ఖండిస్తుందని ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు దండెంపల్లి సత్తయ్య అన్నారు. గురువారం 11వ వార్డు ఇందిరమ్మ కాలనీలో మున్సిపల్, రెవిన్యూ అధికారులు కూల్చిన బేస్మెంట్లను పరిశీలించి బాధితులతో కలిసి ఆయన మాట్లాడుతూ సీపీఐ(ఎం) పోరాటాల ఫలితంగా ఆనాటి ఎమ్మెల్యే నంద్యాల నరసింహారెడ్డి భూమి కొనుగోలు ప్రభుత్వం ద్వారా చేయించి 2005లో పేదలకు పట్టాలు పంపిణీ చేశారన్నారు. వివిధ కారణాలు, ఆర్థిక ఇబ్బందులతో నాడు ఇల్లు కట్టుకోలేకపోవడంతో నేడు ప్రభుత్వం దానిని స్వాధీనం చేసుకుంటామని తెలిపిన వెంటనే పేదలు ఇల్లు నిర్మించుకోవడం కోసం బేస్మెంట్లు చేసుకుంటున్నారన్నారు. గురువారం ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, సమాచారం తెలియజేయకుండా మిట్ట మధ్యాహ్నం జేసీబీతో మున్సిపల్ రెవెన్యూ అధికారులు వచ్చి సుమారు పది బేస్మెంట్లను కూల్చివేశారన్నారు. తెలంగాణ ఏర్పడి తొమ్మిది సంవత్సరాలైనా ఒక్కరికి కూడా గజం భూమి కూడా పంచలేని ప్రభుత్వం పేదల భూములను గుంజుకోవాలని చూడడం శోచనీయమన్నారు. తక్షణమే కూల్చిన బేస్మెంట్లకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ అధికారుల నిరంకుశ చర్యలకు వ్యతిరేకంగా మూడవ తేదీన మున్సిపల్ కార్యాలయం ముట్టడి చేస్తామని బాధితులంతా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కూలిన బేస్మెంట్లను పరిశీలించిన వారిలో 23 వ వార్డు కౌన్సిలర్ ఇంతియాజ్, కాలనీవాసులు సోమగాని దినేష్, దాసరి శంకర్, పజ్జురి సైదులు, బాధితులు గాలి లావణ్య, మరియమ్మ, లక్ష్మమ్మ, అప్షానా, జానిమియా, లతీఫ్, రాజు, శివ, తదితరులు పాల్గొన్నారు.