Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వర్ధంతి సభలో జూలకంటి
నవతెలంగాణ-మిర్యాలగూడ
గాదే శ్రీనివాస్‌రెడ్డి ఆశయాలను సాధించాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. గురువారం సాయంత్రం రామచంద్రగూడెంలోని శ్రీనివాస్ రెడ్డి 41వ వర్ధంతి సందర్భంగా స్థూపం వద్ద పూలమాలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎర్రజెండాను నమ్ముకుని అనేక ఉద్యమాలు చేశారని గుర్తు చేశారు. ఆనాడు శ్రీనివాస్‌రెడ్డి చేసిన ఉద్యమాలు నేటికీ పేద ప్రజలు గుర్తుంచుకున్నారని చెప్పారు. పార్టీ నిర్మాణం కోసం ఆయన చేసిన త్యాగాలు మరువలేనివన్నారు. కుటుంబాన్ని వదిలేసి జీవితాంతం ప్రజల కోసం పనిచేశారని, ఆయన ఆశయ సాధన కోసం కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. ఆయన చూపిన మార్గంలో భవిష్యత్తులో ప్రజా ఉద్యమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, మానవ హక్కుల వేదిక రాష్ట్ర నాయకులు సుబ్బారావు, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరపల్లి వెంకటేశ్వర్లు, శ్రీనివాస్ రెడ్డి సతీమణి పద్మ, నాయకులు డాక్టర్ మల్లు గౌతంరెడ్డి, రవినాయక్, రాగిరెడ్డి మంగారెడ్డి, గోవర్ధనమ్మ, సత్యనారాయణరావు, పరుశురాములు,రొంది శ్రీనివాస్, తిరుపతి రామ్మూర్తి, ఆయూబ్, రమేష్, వినోద్ నాయక్, ఊర్మిళ, అరుణ, మంద రాజు, దేవయ్య తదితరులు పాల్గొన్నారు.