Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు కందాల ప్రమీల
- గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ మోడీ దిష్టిబొమ్మ దహనం
నవతెలంగాణ-నకిరేకల్
పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు కందాల ప్రమీల డిమాండ్ చేశారు. పెంచిన గ్యాస్ ధరలను నిరసిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో దహనం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఇప్పటికే నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి మళ్లీ గ్యాస్ ధరలు పెంచి ప్రజలపై భారాన్ని మోపుతున్నారని విమర్శించారు. గ్యాస్ ధరలు తగ్గించని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి రాచకొండ వెంకట్ గౌడ్, టౌన్ కార్యదర్శి వంటపాక వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీపీ మర్రి వెంకటయ్య, మహిళా సంఘం నాయకురాలు నాగమణి, పన్నాల శశికళ, కంబాలపల్లి సోమయ్య పాల్గొన్నారు.
నల్లగొండ : పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలని 5వ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో పెంచిన గ్యాస్ ధరల నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సార్లు గ్యాస్ ధరలు పెంచడం జరిగిందన్నారు. మధ్యతరగతి కుటుంబాలకు నడ్డి విరిచినపనైందని తెలిపారు. ఇప్పటికే నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి మళ్లీ గ్యాస్ ధరలు పెంచి ప్రజలపై భారాన్ని మోపుతుర్రాన్ని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెంచిన గ్యాస్ ధరలు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఐద్వా పట్టణ కార్యదర్శి భూతం అరుణకుమారి మాట్లాడుతూ పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలన్నారు. గ్యాస్ ధరలు తగ్గించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా పట్టణ కమిటీ సభ్యులు సాబేర బేగం, కట్ట ఎల్లమ్మ, తాహెరా, గాయత్రి, జ్యోతి, నాగమణి, తదితరులు పాల్గొన్నారు.
42వ వార్డులో...
ప్రజలపై భారం మోపుతున్న గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యురాలు తుమ్మల పద్మ డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని సీపీఐ(ఎం) ఆర్టీసీ కాలనీ శాఖ ఆధ్వర్యంలో 42 వార్డులోపెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగాతుమ్మల పద్మ మాట్లాడుతూ ప్రస్తుత కరోనా కష్టకాలంలో ప్రజలు ఉపాధి కోల్పోయి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమయంలో గ్యాస్ ధరలు ప్రజలకు గుదిబండగా మారాయని తెలిపారు. గ్యాస్ కొనలేక మహిళలు కట్టెల పొయ్యి శరణ్యమని గ్యాస్ పక్కకు వేసే పరిస్థితి వచ్చిందన్నారు. ప్రభుత్వం వెంటనే పెంచిన గ్యాస్ ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మహిళలను చైతన్యం చేసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కమిటీ సభ్యుడు గుండాల నరేష్, శాఖ సహాయ కార్యదర్శి మాటూరు సునీత, జీ.పద్మ, వెంకటమ్మ, మాటూరు ఎట్టమ్మ, జయశ్రీ, స్వరూప, అంతమ్మ, విజయ, అక్షిత, ఫాతిమా, తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ (ఎంబీఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో
కేంద్ర ప్రభుత్వం వంటగ్యాస్ ధరలను అమాంతంగా గృహ వినియోగదారులకు రూ.50, కమర్ష్యాల్ 350 లకు పెంచడాన్ని వ్యతిరేకిస్తూ సీపీిఐ (ఎంబీఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద రాస్తారోకో నిర్వహించి కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ సీపీిఐ (ఎంబీఎల్) న్యూడెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి ఇందూరు సాగర్, ఐఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మిడి నగేష్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పీవైఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి బీవీ.చారి, పీడీఎస్ యు జిల్లా ప్రధాన కార్యదర్శి పోలె పవన్, జిల్లా నాయకులు బొంగరాల నర్సింహ,సీపీఐ (యం.యల్) న్యూడెమోక్రసీ, నాయకులు రావుల వీరేష్, కత్తుల చంద్రశేఖర్, దాసరి నర్సింహా,మామిడాల ప్రవీణ్, నాంపల్లి శంకర్, నర్సింహా, బొమ్మపాల అశోక్, రాంనగర్ శంకర్, మోడీకట్టి సురేందర్, మహేష్, చింత యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.
చిట్యాలటౌన్ : కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ సిలిండరు ధరలు తగ్గించాలని ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యురాలు జిట్ట సరోజ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చిట్యాల పట్టణ కేంద్రంలోని శివాజీ నగర్ కాలనీలోకి అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం( ఐద్వా) ఆధ్వర్యంలో గురువారం గ్యాస్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ కట్టెల పొయ్యి, ఖాళీ సిలిండరులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఈ నిరసన కార్యక్రమంలో మహిళా సంఘం మండల నాయకురాలు కందుల అనిత, బొడిగె పూలమ్మ, జిట్ట రమాదేవి, మనీషా, బొలుగూరి యాదమ్మ, గట్టు అండాలు, జనగాం పావని, మనీలా, యాదమ్మ, ప్రియాంక, లత, గండమల్ల ముత్తమ్మ, తదితరులు పాల్గొన్నారు.
చండూర్ :
బీజేపీ మోడీ ప్రభుత్వం పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించాలని సీపీఐ మండల కార్యదర్శి నలపరాజు సతీష్ కుమార్ అన్నారు. గురువారం సీపీఐ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు . ఈ సమావేశంలో సీపీఐ జిల్లా ఏఐటీయూసీ అధ్యక్షుడు దోటి వేంకన్న ,సీపీఐ నాయకులు బండమీద వెంకన్న, జెల్ల శ్రీను, దోటి యాదయ్య, దోమలు శ్రీను,భూతరాజు శీను తదితరులు పాల్గొన్నారు.