Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పెద్దవూర : కాంగ్రెస్ సీనియర్ నేత జిల్లా నాయకులు కర్నాటి కోటిరెడ్డి (77) మరణించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొంది వారం రోజుల క్రితం కోలుకొని ఇంటికి తీసుకొచ్చారు. అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. తీవ్ర అనారోగ్యంతో మూడు నెలలపాటు ఆస్పత్రిలో ఉన్న కోటిరెడ్డి ఇటీవలే కొంత కోలుకొని పెద్దవూరలోని తన ఇంటికి తిరిగి వచ్చారు. గురువారం ఉదయం ఆయన మృతి చెందారు. మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి ఇంటికి వెళ్లి పూలమాలలు వేసి నివాళులర్పించి కుటుంభ సబ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా జానారెడ్డి మాట్లాడుతూ అలిపిరి లేకుండా కాంగ్రెస్ పార్టిలో చురుగ్గా పనిచేశారని ఆయన లేనిలోటు పార్టీకి తీరని లోటని, మంచి మిత్రున్నీ కొల్పాయమని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన వెంట మాజీ జిల్లా పరిషత్ వైస్ ఛైర్మెన్ కర్నాటి లింగారెడ్డి, మాజీ ఎంపీపీ శంకర్ నాయక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మలపల్లి చంద్రశేఖర్రెడ్డి, మండల అధ్యక్షులు పబ్బు యాదగిరిగౌడ్, కూన్రెడ్డి వెంకట్రెడ్డి, పాపిరెడ్డి, పన్రెడ్డి రాంరెడ్డి, లక్ష్మారెడ్డి, తదితరులు ఉన్నారు.