Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గిరిజన సంఘం రాష్ట్ర మహాసభ ప్రారంభ ఉపన్యాసంలో జూలకంటిరంగారెడ్డి
నవతెలంగాణ -మిర్యాలగూడ
తాను మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో గిరిజన సంక్షేమానికి కృషి చేశానని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. మిర్యాలగూడలోని ఏఆర్సీ ఫంక్షన్ హాల్లో తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర మహాసభ సందర్భంగా గురువారం ప్రారంభ ఉపన్యాసం చేశారు. శాసనసభ్యులుగా గిరిజన అభివృద్ధి కోసం పాటుపడినట్టు తెలిపారు. ముఖ్యంగా దామచర్ల మండలంలోని కల్లేపల్లి, నర్సాపురం, గుర్రంబోడు లిఫ్టుల ఏర్పాటుకు కృషి చేశానని దానిద్వారా లక్షల ఎకరాల్లో సాగు నీరు అందేలా చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. ఎన్నో ఏండ్లుగా అక్కడ భూములు బీడులుగా ఉంటే వాటిని సస్యశ్యామలం చేసేందుకు ప్రభుత్వలపై ఒత్తిడి తీసుకొచ్చి లిఫ్ట్ చేసి బీడు భూములను సాగు భూములుగా మార్చానని చెప్పారు. పోడు భూముల హక్కు పట్టాల కోసం పాదయాత్రలు చేపట్టినట్టు చెప్పారు. సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలు ఇవ్వాలని అనేకమార్లు అధికారులు కలిసి ఒత్తిడి తీసుకొచ్చినట్లు తెలిపారు. అడవి భూముల్లో సాగు చేసుకుంటూ రైతులపై అటవీ అధికారులు అనేకమార్లు దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేశారని రైతుల పక్షాన నిలబడి అనేక ఉద్యమాలు చేపట్టామని చెప్పారు. ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాలను గిరిజనులకు అందేలా చర్యలు తీసుకున్నానన్నారు. గిరిజన పక్షాన అనేక పోరాటాలు చేశామని, భవిష్యత్తులో గిరిజనలకు అండగా నిలిచి వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు. జిల్లాలో గిరిజన సంఘం మరింత బలోపేతం కావాలని ఆ దిశగా ఉద్యమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి అధికార్ రాష్ట్రీయ మంచ్ జాతీయ నాయకులు కర్ణాటక రాష్ట్ర బాధ్యులు గురుశాంత్, తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎం.ధర్మానాయక్, ఆర్.శ్రీ రామ్‌నాయక్, రాష్ట్ర ఉపాధ్యక్షులు రవినాయక్ , సహాయ కార్యదర్శి భూక్య వీరభద్రం, బీమాసాహెబ్ వీరన్న వెంకన్న, కే.శంకర్, ఎం.శంకర్, ఎం.రవినాయక్, బి.విజయబాబు, ఏపీ గిరిజన నాయకులు నరసింహ నాయక్, లక్ష్మణ్ నాయక్, గణేష్ నాయక్ కర్ణాటక గిరిజన నాయకులు ఎం .బాలు నాయక్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు నారి ఐలయ్య, కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి స్కైలాబ్, వెంకట్రాములు తదితరులు పాల్గొన్నారు.
ముగిసిన తెలంగాణ గిరిజన సంఘ మహాసభలు
27 తీర్మానాలు ఆమోదం..నూతన కమిట్ ఎన్నిక
తెలంగాణ గిరిజన సంఘ రాష్ట్ర మూడో మహాసభలు నల్గొండ జిల్లా మిర్యాలగూడలో రెండు రోజులపాటు అట్టహాసంగా సాగి గురువారం సాయంత్రం ముగిశాయి. మొదటిరోజు మహాప్రదర్శన భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు జిల్లా నలుమూలల నుండి వేలాది మంది గిరిజనలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేశారు. గిరిజన సంస్కృతీ, సాంప్రదాయాలు నృత్యాలు డపు కోలాటాలతో ఉత్సాభరితంగా సాగింది. రెండవ రోజు గురువారం ఉదయం గిరిజన సంఘం సీనియర్ నాయకులు గుగులోతు ధర్మ జెండా ఆవిష్కరణ చేశారు. ప్రారంభ ఉపన్యాసం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి చేయగా, ఆదివాసి అధికార్ రాష్ట్రీయ మంచ్, మాజీ ఎంపీ బృందాకరత్ సంఘం దిశ నిర్దేశం చేశారు, దేశవ్యాప్తంగా లంబాడీలు గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలు బిజెపి ఆర్ఎస్ఎస్ ఆలంబిస్తున్న వ్యతిరేక విధానాలను క్లుప్తంగా వివరించారు. తెలంగాణ గిరిజన సంఘం బలోపేతం కు తీసుకోవలసిన చర్యలు, చేపట్టబోయే ఉద్యమాల గురించి వివరించి చైతన్యపరిచారు. అనంతరం జిల్లాల వారీగా సంఘం నాయకులు నివేదిక సమర్పించారు. ఈ మహాసభలో 27 తీర్మానాలను ఆమోదించారు. అనంతరం 13 మందితో రాష్ట్ర కార్యదర్శివర్గం 57 మందితో రాష్ట్ర నూతన కమిటీని ఎన్నుకున్నారు.