Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ పమేలా సత్పతి
భువనగిరిరూరల్ : ఈనెల 15 నుండి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. గురువారం కాన్ఫరెన్స్ హాల్లో ఇంటర్ పరీక్షలపై సంబంధిత శాఖల అధికారులతో కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ఇంటర్మీడియట్ పరీక్షలకు చేపట్టవలసిన పనులను మీద సమీక్షిస్తూ, మార్చి 15 వ తేదీ నుండి ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించబడుతున్నందున అధికారులు సమన్వయంతో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జిల్లాలో 31 పరీక్షా కేంద్రాల ద్వారా 13,309 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని, 11 ప్రశ్న పత్రాల స్టోరేజ్ పాయింట్లు ఉంటాయని, ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్, రెండు సిట్టింగ్ స్క్వాడ్ టీములు, ఒక జిల్లా ఎగ్జామినేషన్ కమిటీ టీమ్ పరీక్షల నిర్వహణను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తాయని తెలిపారు. పోలీస్ శాఖ వారు పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాట్లు నిర్వహించాలని, తహశీలుదార్లు పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించాలని, పరీక్షా సమయంలో జీరాక్స్ సెంటర్లు మూసివేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు హాజరయ్యేలా ఆర్టీసీ అధికారులు బస్సులను నడపాలని, వైద్య అధికారులు పరీక్షా కేంద్రాల వద్ద ఫస్ట్ ఎయిడ్ కిట్స్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మందులతో మెడికల్ పాయింట్ ఏర్పాటు చేయాలని, విద్యుత్ శాఖ అధికారులు పరీక్షా కేంద్రాలలో ఎటువంటి విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పోస్టల్ శాఖ వారు జవాబు పత్రాలను సరిగా రిసీవ్ చేసుకోవాలని సూచించారు. పరీక్షా కేంద్రాలలో మంచినీరు, ఫాన్స్, టాయిలెట్స్ ఏర్పాట్లు సరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ డి శ్రీనివాస్ రెడ్డి, చౌటుప్పల్ రెవిన్యూ డివిజనల్ అధికారి కె వి ఉపేందర్ రెడ్డి, పోలీస్ అసిస్టెంట్ కమిషనర్ వెంకట్ రెడ్డి, జిల్లా ఇంటర్మీడియట్ ఆఫీసర్ రమణి, అధికారులు పాల్గొన్నారు.