Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి ఉపేందర్ రెడ్డి
నవతెలంగాణ- ఆలేరురూరల్
తెలంగాణ రాష్ట్రాన్ని పాలించాలంటే దమ్మున్న నాయకుని ప్రజలు ఎన్నుకోవాలని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి పేర్కొన్నారు శుక్రవారం మండలంలోని మందనపల్లి బస్ స్టేషన్ ఆవరణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో కరెంటు, ఆర్టీసీ చార్జీలు, రిజిస్ట్రేషన్ చార్జీలు పెరిగితే పట్టించుకునే నాధుడే కరువయ్యాడన్నారు .గ్రామాలలో ఇంటి పన్నులు అధికంగా పెంచారన్నారు. మద్యం తాగడం నేర్పింది సీఎం కేసీఆర్ మద్యం తాగి రోడ్డు మీద ప్రయాణం చేస్తుంటే పోలీసు శాఖ వారు అధికంగా జరిమానాలు వసూలు చేస్తూ సామాన్య మానవుని నడ్డి విరిచే విధంగా చూస్తున్నారని ఆరోపించారు. అంతకుముందు లక్ష రూపాయలతో ఏర్పాటు చేసిన బస్షెల్టర్ను ఆవయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిగిరి విద్యాసాగర్ ,కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షుడు ఎజాజు, మాజీ పాల సెంటర్ చైర్మన్ గాజుల దశరథ, సింగిల్ విండో డైరెక్టర్ కట్టెగొమ్ముల సాగర్ రెడ్డి, కొల్లూరు కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు శ్రీపాల్ రెడ్డి, మదనపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు ఉట్కూరి అంజయ్య ,మహిళా అధ్యక్షురాలు దీప, నాయకులు బిక్షపతి ,కరుణాకర్ ,గణేష్ తదితరులు పాల్గొన్నారు.