Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నాంపల్లి
కేఎంసీ విద్యార్థిని డాక్టర్ ప్రీతినాయక్ మృతికి కారణమైన వారిని వెంటనే కఠినంగా శిక్షించాలని, ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని బహుజన సమాజ్ పార్టీ మునుగోడు నియోజకవర్గ ఇన్చార్జ్ ఆందోజు శంకరాచారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన నాంపల్లి మండల కేంద్రంలో ర్యాగింగ్ భూతం వల్ల మరణించిన మెడికో ప్రీతి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ విద్యార్థులతో కలిసి మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రీతి గిరిజన ఆడబిడ్డ కాబట్టే ఆమెకు న్యాయం చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని తెలిపారు. ప్రీతికో న్యాయం ప్రియాంకరెడ్డికో న్యాయమా అని ప్రశ్నించారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే అని అన్నారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా యాంటీ ర్యాగింగ్ కమిటీలు వేసి ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ నాంపల్లి మండల అధ్యక్షుడు పల్లేటి వినోద్ కుమార్, మునుగోడు నియోజకవర్గ అధ్యక్షుడు గండు నాగేంద్రబాబు, స్వేరో స్టూడెంట్స్ యూనియన్ ఆకులపల్లి నరేష్, నాంపల్లి మండల ఉపాధ్యక్షుడు జిల్లగోని మహేష్ ముదిరాజ్, పసుమూరు గ్రామ అధ్యక్షుడు పంబాల వంశీ, కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.