Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోమటిరెడ్డి చంద్రారెడ్డి
- వంటావార్పుతో నిరసన
నవతెలంగాణ- భువనగిరిరూరల్
కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వాలు అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్రంలో గ్రాట్యుటి చట్టాన్ని అమలు చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కోమటిరెడ్డి చంద్రారెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. మూడో శుక్రవారం ప్రదర్శన నిర్వహించి కలెక్టరేట్ గేటు ఎదుట వందలాది మందితో ధర్నా నిర్వహించారు. వంటావార్పు చేసి నిరసనతెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యలు పరిష్కారమయ్యేవరకు పోరాడుతామన్నారు. అవసరమైతే రానున్నకాలంలో నిరవధిక సిద్దమవుతామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలని, ఐసీడీఎస్‌కు కేంద్రం బడ్జెట్ పెంచాలని, నూతన జాతీయ విద్యావిధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కల్లూరి మల్లేశం, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దాసరి పాండు, అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బూరుగు స్వప్న, చిలువేరు రమాకుమారి, జిల్లా సహాయ కార్యదర్శి బోడ భాగ్య, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేశం, నాయకులు సునంద, అరుణ, సఫియా, పద్మ, షాహెద, శోభ, వసంత, జయప్రద, సునిత, భాగ్య, అనురాధ, కళ్యాణి, కవిత, రమా, సంతోష, భాగ్యలక్ష్మి, ఉమ, రాధిక, రమ్య, భూలక్ష్మి, జంగమ్మ, రుక్మిణి, భువనేశ్వరి, జయమ్మ, మాధవి, మంజుల, విజయలక్ష్మి, సరిత, రమాదేవి, బాలలక్ష్మి, వసంత, సావిత్రి, రూప పాల్గొన్నారు.