Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా పరిషత్ సీఈవో ప్రేమ్ కరణ్‌రెడ్డి
నవతెలంగాణ-మర్రిగూడ
మొక్కల పట్ల ప్రతి ఒక్కరు ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని జిల్లా పరిషత్ సీఈవో, ఇన్చార్జ్ డీఆర్డీఓ ప్రేమ్ కరణ్ రెడ్డి అన్నారు. శుక్రవారం మర్రిగూడ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో జే. వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఉపాధి హామీ పనులపై సమీక్ష సమావేశానికి ఆయన ముఖ్యఅతిధిగా హాజరై మాట్లాడారు. నాటిన మొక్కలు 100శాతం బ్రతికే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రతి మండలంలోని మూడు నుంచి ఐదు గ్రామాలు ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని, ప్రతి కుటుంబానికి వందరోజుల పని దినాలు కల్పించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో శ్రీనివాస్ రెడ్డి, ఎంపీఓ ఝాన్సీ, ఏపీఎం సంకు హరి, ఏపిఓ వెంకటేశం, పంచాయతీ కార్యదర్శులు, టెక్నికల్ అసిస్టెంట్లు, సీసీలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, తదితరులు పాల్గొన్నారు.