Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రిజర్వేషన్ ప్రకారం పంపిణీ
- అర్ధరాత్రి 12 గంటల వరకు నిరీక్షణ
నవతెలంగాణ-దేవరకొండ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన డబల్ బెడ్రూమ్ పథకం ద్వారా దేవరకొండలో పేదల సొంతింటి కల సహకారం అయింది. మండలంలోని కొండ భీమనపల్లి గ్రామపంచాయతీ శివారులో దేవరకొండ మున్సిపాలిటీ వాసుల కోసం పట్టణ శివారులో 544డబల్ బెడ్ రూమ్‌లను నిర్మించారు. వీటిలో 60 గృహాలను కొండ భీమనపల్లి గ్రామస్తులకు కేటాయించారు. మిగిలిన 484 డబల్ బెడ్ రూమ్‌లకు గురువారం రాత్రి స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఆర్డీఓ గోపి రామ్ అధ్యక్షతన రెవెన్యూ సిబ్బంది రిజర్వేషన్ల ప్రకారం లాటరీ పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేశారు. డబల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం పట్టణానికి చెందిన 1,725 మంది డబల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. గత రెండు మూడు రోజులపాటు పట్టణంలో వార్డుల వారిగా రెవెన్యూ అధికారులు దరఖాస్తులను పరిశీలించి 585 మంది లబ్ధిదారులుగా అర్హత గల వారిని గుర్తించారు. వార్డుల వారిగా రిజర్వేషన్ ప్రాతిపదికన ఎస్సీల నుండి 96 మంది అర్హులుగా గుర్తించగా 82మందికి, ఎస్టీలలో 15 మంది అర్హులుగా గుర్తించగా 29 (6శాతం) ఇండ్లు ,మైనార్టీలలో 175 మందిని అర్హులుగా గుర్తించగా 58 (12 శాతం) ఇండ్లు , ఇతరులకు 315 గహాల చొప్పున కేటాయించి లాటరీ ద్వారా ఎంపిక చేశారు. రిజర్వేషన్ల ప్రకారం లాటరీ ద్వారా ఎంపిక చేసిన అనంతరం ఎస్సీ మైనార్టీలలో ఉన్న అర్హత గల వారిని ఇతర దరఖాస్తులలో కలిపి లాటరీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఎస్టీలలో 29 డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఉన్నప్పటికీ అర్హులు తక్కువగా ఉండడంతో మిగిలిన 14 డబల్ బెడ్ రూమ్ ఇండ్లను ఇతర గ్రూపులకు చెందిన వారికి ఎంపిక చేశారు. మరో 101 మందికి డ్రాలో డబల్ బెడ్ రూమ్ ఇల్లు రాకపోవడంతో ప్రజా ప్రతినిధులపై, అధికారులపై, శాపనార్థాలు పెడుతూ ప్రశాంతంగా వెళ్ళిపోయారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో గోపిరామ్, డీఏవో సంఘమిత్ర, తహసీల్దారులు రాజు, అరుణ, దేవదాసు, రెవెన్యూ సిబ్బంది హర్షద్, అయూబ్, వెంకట్, తదితరులు పాల్గొన్నారు.
ఏడు గంటల పాటు నిరీక్షణ...
సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభం కావలసిన డబల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ అధికారుల అపసోపాల మధ్య గురువారం రాత్రి 9 గంటలకు లాటరీ ప్రక్రియను ప్రారంభించారు. అర్ధ రాత్రి 12 గంటలకు లబ్ధిదారుల ఎంపిక డ్రా ముగిసింది. ఇండ్ల కోసం ఏడు గంటలపాటు నిరీక్షించాల్సి వచ్చింది. కొంతమంది మహిళలు అసహనానికి గురయ్యారు. డబల్ బెడ్ రూమ్ ఇండ్ల ఎంపిక ప్రక్రియలో అవకతవకలు జరిగాయని పలువురు ఆరోపించారు .మొదట్లో అర్హులుగా చూపిన వారిని తర్వాత అనర్హులుగా తొలగించారని, ఇల్లు ఉన్నవారికి సైతం డబల్ బెడ్ రూమ్ లకు అర్హులుగా ఎంపిక చేశారని కొందరు ఆరోపించారు. డబల్ బెడ్ రూమ్ ఇల్లు మహిళల కేటాయించడంతో అర్ధరాత్రి వరకు మున్సిపల్ కార్యాల ఆవరణలోనే పడిగాపులు కాశారు. లాటరీ సమయంలో పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావడంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు .దేవరకొండ సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎస్సై బాల కృష్ణ భద్రత ఏర్పాట్లు చేపట్టారు.