Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- సూర్యాపేట కలెక్టరేట్
మిషన్ భగీరథ ద్వారా నిరంతర నీటి సరఫరా కై మెరుగైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు సంబంధంతో ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో స్పెషల్ ఆఫీసర్లు, మిషన్ భగీరథ పై ఇంట్రా ,గ్రిడ్ ఏఈ, డిఈ లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సూర్యాపేట జిల్లాలో మిషన్ భగీరథ ద్వారా త్రాగునీరు సరఫరాపై సమీక్షించారు. రాబోయే వేసవి కాలంలో ఎలాంటి త్రాగునీరు ఎద్దడి లేకుండా తగు చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశించారు. గ్రామ లలో పంచాయతీ సెక్రెటరీలు మిషన్ భగీరథ సిబ్బంది ప్రతివారం ప్రత్యేక సమావేశాలు ఏర్పరచుకొని తాగునీటి సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు. గ్రామాలలో త్రాగునీటి సమస్యలపై ముందుగా మండల్ స్పెషల్ ఆఫీసర్ కు తెలియజేయాలని పేర్కొన్నారు. వారంలో ప్రతి సోమవారం సాయంత్రం, గురువారం ఉదయం మిషన్ భగీరథ అధికారులు, ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్లు, పంచాయతీరాజ్ ఇంజనీర్లు, రోడ్లు భవనాల శాఖ, విద్యుత్ శాఖ ఇంజనీర్లు సమావేశం ఏర్పరచుకొని తాగునీటి సమస్యల పరిష్కారానికి చర్చించాలన్నారు. గ్రామాలలో కొన్నిచోట్ల పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు ఆర్ అండ్ బి అధికారులు వేస్తున్న సిసి రోడ్లు, సైడ్ డ్రైన్స్ నిర్మాణాల కారణంగా మిషన్ భగీరథ పైప్ లైన్లకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని, సంబంధిత శాఖ ఇంజనీరింగ్ అధికారులు తగు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామపంచాయతీ సిబ్బంది మున్సిపల్ సిబ్బంది మిషన్ భగీరథ పై కూడా మానిటరింగ్ చేయాలని కలెక్టర్ తెలిపారు. మిషన్ భగీరథ పై ఈఈ లు వెబేక్స్ ద్వారా ప్రతి సోమవారం గురువారం ఏఈలు డి ఈ లతో రివ్యూ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఇంజనీరింగ్ అధికారులు అందరూ వెబేక్స్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని సిద్ధంగా ఉండాలన్నారు. ప్రతిరోజు ఉదయం డి ఆర్ డి ఓ, డిపిఓ, సిఈఓ, లు గ్రామాలలో క్షేత్ర పరిశీలన చేయాలన్నారు. ఇప్పటివరకు జిల్లాలోమిషన్ భగీరథలో ఇంట్రా విభాగంలో 214 సమస్యలను గుర్తించడమైనదని గ్రిడ్ విభాగంలో 178 సమస్యలను గుర్తించడం జరిగిందని ఇప్పటివరకు 60 సమస్యలను ఇంజనీరింగ్ అధికారులు పరిష్కరించడం జరిగిందని,వేసవి ని దృష్టిలో పెట్టుకొని 15 రోజుల్లోగా సమస్యలన్నిటిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అన్నారు. తుంగతుర్తి పరిధిలోని మిషన్ భగీరథ పథకం ద్వారా తాగు నీటి సరఫరా బాగా జరుగుతున్నదని డీఈలను కలెక్టర్ మెచ్చుకున్నారు. అలాగే ఆత్మకూర్, మోతే, పెన్ పహాడ్, ఏఈలను కలెక్టర్ అభినందించారు . నూతన కలెక్టరేట్ కార్యాలయ పనులు మే 31వ తేదీ కల్లా పూర్తిచేయాలని ఆర్ అండ్ బి అధికారులకు కలెక్టర్ ఆదేశించారు . అనంతరం ఈ ఆఫీస్ ఫైల్ ప్రాసెసింగ్ పై జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి ఈ ఆదివారం వరకు పాత ఫైలింగ్ పద్దతి విధానం అమలులో ఉంటుందని తదుపరి జిల్లా శాఖల నుండి పేపర్ రహిత ఈ ఆఫీస్ విధానం అమలులో ఉంటుందని అధికారులు అందరూ తప్పక పాటించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ పాటిల్ హేమంత్ కేశవ్ అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎస్ మోహన్ రావు మిషన్ భగీరథ ఎస్సి సురేష్, ఈఈ లు పాపారావు, రామారావు, జడ్పీ సీఈవో సురేష్ కుమార్, ఆర్డీవోలు కిషోర్ కుమార్ ,వెంకారెడ్డి, జిల్లా స్పెషల్ ఆఫీసర్లు డీఈలు, ఏఈలు సిబ్బంది పాల్గొన్నారు.