Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి
నవతెలంగాణ- ఆలేరుటౌన్
నరేంద్ర మోడీ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక చర్యలకు పాల్పడుతుందని రాష్ట్ర ప్రభుత్వ విప్ , ఆలేరు శాసన సభ్యురాలు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు . నియోజకవర్గ కేంద్రంలో శుక్రవారం బస్టాండ్ చౌరస్తా ఆవరణలో రెండవ రోజు పెంచిన వంట గ్యాస్ ధరను నిరసిస్తూ మహిళలతో బిఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దహనం చేశారు. బస్టాండ్ నుండి ఆర్ అండ్ బి కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరులతో రాష్ట్ర ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మాట్లాడుతూ పెంచిన ధరలను నిరసిస్తూ స్వచ్ఛందంగా ఇండ్లలో ఉన్న మహిళలు కడుపు మంటతో రోడ్డెక్కి నిరసన తెలియజేస్తున్నారన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం పేద ప్రజలను ఆగం చేసే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. ప్రజలు పెరిగిన ధరల కారణంగా కట్టెల పొయ్యి పై వంట చేసే పరిస్థితి నెలకొందన్నారు. తరుచూ సిలిండర్ ధర పెంచుతూ,డొమెస్టిక్ సిలిండర్ పై రూ. 50 చొప్పున, కమర్షియల్ సిలిండర్ పై రూ. 350 చొప్పున పెంచడం దారుణమన్నారు. వెంటనే ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేశం,గంగుల శ్రీనివాస్, పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ కుండే సంపత్ ,యాదగిరిగుట్ట జెడ్పిటిసి తోటకూర అనురాధ, జిల్లా ఆర్టిఏ సభ్యులు పంతం కృష్ణ, గొర్ల కాపరుల సంఘం జిల్లా డైరెక్టర్ జల్లి నరసింహులు,గ్రంధాలయాల డైరెక్టర్ ఆడెపు బాలస్వామి,వార్డు కౌన్సిలర్లు బేతి రాములు, రాయపురం నరసింహులు, పిఎసిఎస్ చైర్మన్ మొగలగాని మల్లేశం, వైస్ చైర్మన్ చింతకింది చంద్రకళ మురహరి, డైరెక్టర్లు ఆరే మల్లేశం, బిక్షపతి, ఎంపీటీసీ జూకంటి అనురాధ అనిల్, సర్పంచులు బండ పద్మా పర్వతాలు, కోటగిరి పండరి, తదితరులు పాల్గొన్నారు.
భువనగిరి : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లకు కొమ్ముకాస్తూ ధరలు పెం పేదల నడ్డి విరుస్తోందని భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. వంట గ్యాస్ సిలిండర్ ధర పెంపును నిరసిస్తూ శుక్రవారం జిల్లా కేంద్రంలోని జగ్జీవన్ రావు చౌరస్తా వద్ద రహదారిపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలో ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులతో బైటాయించారు. సిలిండర్లను పక్కన పెట్టి కట్టెలపొయ్యిపై వంటలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాకముందు యూపీఏ ప్రభుత్వంలో రూ.400 ఉన్న వంటగ్యాస్ సిలిండర్ రేటు నేడు రూ.1,200కు చేరిందన్నారు. అప్పట్లో గ్యాస్ ధర పెంచితే ప్రస్తుత కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ రోడ్లపై కట్టెల పొయ్యిపై వంట చేసి ఆందోళనలు నిర్వహించారని గుర్తుచేశారు. మరి ఇప్పుడు గ్యాస్ ధర పెంచినా ఆమె ఎందుకు స్పందించడం లేదన్ని ప్రశ్నించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అచ్చేదిన్ అంటివి ఇప్పుడు గ్యాస్ సిలిండర్ల ధరను పెంచి ప్రజలను చచ్చేదిన్ స్థాయికి తేస్తివి అంటూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీరుపై అసహనం వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్ కొలుపుల అమరేందర్, మున్సిపల్ చైర్మన్ ఏనా బోయిన ఆంజనేయులు, భువనగిరి ఎంపీపీ నారాల నిర్మల వెంకటస్వామి యాదవ్, జడ్పిటిసి సూబ్బురు బీరు మల్లయ్య, వైస్ చైర్మన్ చింతల కృష్ణయ్య, పట్టణ అధ్యక్షులు ఏవి కిరణ్ కుమార్, జనగాం పాండు, బలుగురి మధుసూదన్ రెడ్డి, కంచి మల్లయ్య, రత్నపురం పద్మ, రాంపల్లి నగేష్, జలీల్, పెద్ద ఎత్తున బి ఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు.