Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా విద్యాధికారి నారాయణరెడ్డి
నవతెలంగాణ -బీబీనగర్
రానున్న పదవ తరగతి వార్షిక వార్షిక పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలని జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణరెడ్డి అన్నారు, శుక్రవారం మండల పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బీబీనగర్, వెంకిర్యాల, కొండమడుగు పాఠశాలలను పరిశీలించారు. సందర్భంగా ఆయా పాఠశాలలో నిర్వహించిన ప్రీ ఫైనల్ పరీక్ష ఫలితాలపై అసంతృప్తి వ్యక్తపరిచారు. బీబీనగర్ వెంకిర్యాల పాఠశాలలో ఫలితాలపై అసంతృప్తి వ్యక్తపరుస్తూ ఇద్దరు ఉపాధ్యాయులపై నోటీసులు జారీ చేసినట్లు మండల విద్యాధికారి నాగవర్ధన్ రెడ్డి తెలిపారు, కొండమడుగులో పాఠశాల నిర్వహించిన పరీక్షలు పై ఆయన సంతృప్తి వ్యక్తం పరిచినట్లు తెలిపారు, రానున్న వార్షిక పరిక్షలో వందశాతం ఉత్తీర్ణత సాధించాలని ఇందుకోసం తగిన విధంగా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.