Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -భువనగిరిరూరల్
1999లో తాను నల్లగొండ ఏఎస్పీగా పని చేస్తున్న సమయంలో బొమ్మలరామారం పోలీసు స్టేషన్ మీద జరిగిన నక్సలైట్ దాడిలో ప్రాణాలకు తెగించి ఎదుర్కొన్న ఏడుగురు పోలీసు సిబ్బందిలో ఒకరైన కానిస్టేబుల్ గుత్త వెంకట్ రెడ్డిని శుక్రవారం రాచకొండ కమిషనరేట్ సీపీ చౌహాన్ తన ఆఫీస్ నెరేడ్‌మెట్‌కు పిలిపించుకుని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బొమ్మలరామారం పోలీసు స్టేషన్ మీద 1999 జనవరి 30న అర్థరాత్రి హఠాత్తుగా జరిగిన సాయుధ నక్సలైట్ దాడిని ప్రాణాలకు తెగించి ఎదుర్కొన్న ఏడుగురు పోలీసు సిబ్బందిలో గుత్తా వెంకట్ రెడ్డి ఒకరిని అన్నారు. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకూ జరిగిన, 40మందికి పైగా పాల్గొన్న ఈ దాడిలో అప్పుడు మెయిన్ సెంట్రీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ గుత్త వెంకట్ రెడ్డి తన తోటి ఆరుగురు సిబ్బందితో కలిసి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడి నక్సలైట్ ల దాడి నుండి స్టేషన్ ను, సిబ్బందిని రక్షించారని తెలిపారు. సివిల్స్‌కి ప్రిపేర్ అవుతున్న వెంకట్ రెడ్డి కూతురు స్నేహ రెడ్డిని అభినందించారు. ప్రిపరేషన్ కు అవసరమైన గైడెన్స్, ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు.