Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్
నవతెలంగాణ -రామన్నపేట
పెరిగిన గ్యాస్ ధరలతో కుటుంబ పోషణ భారంగా మారుతున్నందున ప్రభుత్వం వెంటనే పెంచిన గ్యాస్ ధరలను ఉపసంహరించుకోవాలని సీపీిఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీపీిఐ(ఎం)ఆద్వర్యంలో పెరిగిన గ్యాస్ ధరలను నిరసిస్తూ మండల కేంద్రంతోపాటు మునిపంపుల, పల్లివాడ, వెల్లంకి గ్రామాలలో గ్యాస్ సిలిండర్లతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సుభాష్ సెంటర్లో ఆయన మాట్లాడుతూ అదుపు లేని ధరలతో పేదలపై మోడీ ప్రభుత్వం భారాలు మోపుతుందని విమర్శించారు. కరోనా కష్టకాలంలో ప్రజలు ఉపాధి కోల్పోయి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఈ సమయంలో పెరిగిన గ్యాస్ ధరలతో ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం అదుపు లేకుండా పెంచుతున్న గ్యాస్ ధరలు దేశ ప్రజలకు గుదిబండగా మారాయన్నారు. గ్యాస్ కొనలేక మహిళలు కట్టెల పొయ్యి శరణ్యమని అంటున్నారన్నారు. గ్యాస్ పక్కకు వేసే పరిస్థితి వచ్చిందన్నారు. కట్టెల పొయ్యి వాడకం అంటూ మళ్లీ వస్తే పొగతో మహిళలు అనారోగ్యానికి గురవుతారన్నారు. గ్యాస్ కి 1200రూపాయలు చెల్లించాల్సి వస్తుందన్నారు. పాలకులు స్పందించి ధరలను తగ్గించని పక్షంలో ప్రజలనూ చైతన్యం చేసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మేక అశోక్ రెడ్డి, మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, నాయకులు వనం ఉపేందర్, కూరెళ్ళ నరసింహ చారి, బల్గూరి అంజయ్య, వైస్ ఎంపిపి నాగటి ఉపేందర్, యాదాసు యాదయ్య, కల్లూరి నగేష్, జంపాల అండాలు, కందులహనుమంతు, ఎండి రషీద్, ఆవనగంటి నగేష్, గొరిగె సోములు, అప్పం సురెందర్, పిట్టల శ్రీను, మునుకుంట్ల లెనిన్, బావండ్లపల్లి సత్యం, గుండాల భిక్షం, రాపోలు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
వలిగొండ: కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజుగౌడ్ , జిల్లా కమిటీ సభ్యులు మద్దెల రాజయ్య, మండల కార్యదర్శి సిర్పంగి స్వామి డిమాండ్ చేశారు. గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం మండల కేంద్రంలోని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చిన 9ఏండ్ల కాలంలో సుమారు 13 సార్లు గ్యాస్ ధరలను పెంచి పేద ప్రజలు సామాన్యులపై విపరీతమైన భారాలు వేసిందన్నారు ్ల పెట్రోల్ డీజిల్ ధరలతో పాటు నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగి ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతుంటే సరిపోనట్టు మళ్లీ గ్యాస్ ధరల్ని పెంచడం మూలికే నక్కపై తాటిపండు పడ్డ విధంగా ఉందన్నారు. వెంటనే ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు చీరక శ్రీశైలం రెడ్డి మెరుగు వెంకటేశం,కూర శ్రీనివాస్, కల్కూరి రామచంద్రం మండల కమిటీ సభ్యులు మొగిలిపాక గోపాల్,కొండే కిష్ణయ్య,గాజుల ఆంజనేయులు, కర్ణకంటి యాదయ్య, కందడి సత్తిరెడ్డి,దుబ్బ లింగం,కవిడే సురేష్, కల్కూరి ముత్యాలు నాయకులు దొడ్డి బిక్షపతి, ధ్యానబోయిన యాదగిరి, వేముల నాగరాజు, రాధారపు మల్లేశం, చేగూరు నగేష్,పలుసం లింగం,కోరబోయిన మహేష్, జరుగుమల్ల శ్రీకాంత్, తాందారుపళ్లి గోపాల్,ఆవనగంటి గణేష్, బొడ్డు రాములు పాల్గొన్నారు
చౌటుప్పల్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెంచిన వంటగ్యాస్ ధరలు ఉపసంహరించుకోవాలని డిమాండ్‌చేస్తూ సీపీఐ(ఎం), ప్రజాసంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం చౌటుప్పల్ పట్టణకేంద్రంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) మున్సిపల్ కార్యదర్శి బండారు నర్సింహా, వ్యవసాయ కార్మికసంఘం మండలకార్యదర్శి బొజ్జ బాలయ్య మాట్లాడారు. వంటగ్యాస్ సిలిండర్ ధర ఎనిమిదేళ్ల క్రితం రూ.400 ఉండగా నేడు బీజేపీ ప్రభుత్వంలో రూ.1176కు పెంచి పేద, మధ్యతరగతి ప్రజల నడ్డివిరుస్తుందన్నారు. గ్యాస్‌తోపాటు పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శివర్గ సభ్యులు ఆకుల ధర్మయ్య, నాయకులు బొమ్మకంటి కృష్ణ, ఆదిమూలం నందీశ్వర్, బత్తుల దాసు, సామిడి నాగరాజురెడ్డి, పల్లె మధుకృష్ణ, మదార్, బోయ యాదయ్య, జక్కిడి అంజిరెడ్డి, పంతంగి సోమరాజు, బత్తుల జయమ్మ, శంకర్‌రెడ్డి, వీరమల్ల యాదయ్య, వనజ, ప్రకాశ్, పంతంగి సంధ్య, బుచ్చయ్య, పుష్ప, ఆండాలు పాల్గొన్నారు.
సంస్థాన్‌నారాయణపురం : బీజేపీ ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం మండల కేంద్రంలో సీపీఐ(ఎం),బీఆర్ఎస్ పార్టీలు వేర్వేరుగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక విపరీతంగా గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి ప్రజల నడ్డి విరిస్తుందన్నారు.ధ నవంతులను మరింత ధనవంతులుగా చేస్తు పేదలను మరింత పెదలుగా మారుస్తుందన్నారు.నిరసనగా వంట వార్పు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) సీనియర్. నాయకులు దోంతగొని పెద్దలు,జిల్లా కమిటి సబ్యులు గుంటోజు శ్రీనివాసాచారి, మండల కార్యదర్శి దొడ యాదిరెడ్డి, డివైఎఫ్ఐ నాయకులు.దొంతగాని అమరేందర్, మండల కమిటీస భ్యులు చింత కాయల నర్శిహ్మ, పిట్ట రాములు, కర్థాలబిక్షం,సుర్వి కృష్ణమూర్తి, పల్లె యాది రెడ్డి,గుంట్టోజు సుదర్శన్ చారి,భొమ్మగాని రయ్యా,చాడ.నర్సింహా,చెర్కుపల్లి.నర్సింహా,సిహెచ్.గాలయ్య పలువుర ు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.
ఆలేరురూరల్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వంట గ్యాస్ సిలిండర్ ధరలను పెంచి సామాన్య ప్రజలపై మోయలేని బారం వేస్తుందని, తక్షణమే పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను ఉపసంహరించుకుని, ప్రజలపై బారం పడకుండా చూడాలని సీపీఎం పార్టీ మండల కార్యదర్శి వర్గ సభ్యులు సూదగాని సత్యరాజయ్య, బుగ్గ నవీన్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.,శుక్రవారం ఆలేరు మండలం శర్భనాపురం గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు కారే రాజు, బద్దం ముత్తిరెడ్డి, గడ్డమీది యాదగిరి, వార్డు సభ్యులు సూదగాని నరేందర్, నవీన్, మల్లేష్, సైదాపురం భాస్కర్, కందుల యాదగిరి, అంగడి యాదగిరి, బోడ రఘుపతి తదితరులు పాల్గొన్నారు.
బొమ్మలరామారం : మండల కేంద్రంలోని సీపీఐఎం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు.మండల కార్యదర్శి ర్యకల శ్రీశైలం మాట్లాడుతూ..మోడీ సర్కార్ పేద ప్రజలపై నిరంతరం భారం మోపుతూ పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని , మండలో నిరసిస్తూ పెంచిన ధరను వెంటనే ఉపసంహరించుకోవాలని నిరసన తెలియజేయడం జరిగిందన్నారు.పెంచిన ధరలు వెంటనే తగ్గించకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మైలారం లక్ష్మయ్య సంసారం యాదయ్య ,ముక్కాల పున్నమ్మ ,బోదాస్ నరసమ్మ, నరేష్, సమంత, తదితరులు పాల్గొన్నారు
మోత్కూర్: కేంద్ర ప్రభుత్వం పెంచిన వంటగ్యాస్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఐ(ఎఎం) జిల్లా కమిటీ సభ్యుడు బొల్లు యాదగిరి డిమాండ్ చేశారు. పెంచిన వంటగ్యాస్ ధరలను నిరసిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో శుక్రవారం మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో నిరసన చేపట్టి ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తొమ్మిదేళ్లుగా వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను అడ్డగోలుగా పెంచుతుందని, రూ.400 ఉన్న సిలిండర్ ధర నేడు 1150 అయ్యిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి గుండు వెంకటనర్సు, జిల్లా కమిటీ సభ్యులు రాచకొండ రాములమ్మ, జిల్లా నాయకులు కూరెళ్ళ రాములు, కందుకూరి నర్సింహ, పిట్టల చంద్రయ్య, తాటి కరుణాకర్, మాండ్ర చంద్రయ్య, లక్ష్మి, చిందం శ్రీను తదితరులు పాల్గొన్నారు.
యాదగిరిగుట్ట: కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట పట్టణంలో, యాదగిరిగుట్ట మండలం గౌరాయపల్లిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మంగ నరసింహులు మాట్లాడుతూ జేపీి ప్రభుత్వం గృహ వినియోగదారుల వంట గ్యాస్ సిలిండర్ రూ.50 ,కమర్షియల్ గ్యాస్ సిలిండర్ 350 రూపాయలు పెంచిందని ఆవేదన వ్యక్తం చేశారు. పెరిగిన సిలిండర్ ధరల వల్ల సామాన్య ప్రజలకు మోయలేని భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు . ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల కార్యదర్శి బబ్బూరి పోశెట్టి నాయకులు ఎస్కే లతీఫ్ కానుగంటి రామచందర్ బండ్రెడ్డి ఈశ్వర్ రెడ్డి కానుగంటి రాంబాయి వడ్లకొండ బిక్షపతి నేరేడు భాస్కర్ తమ్మలి తిరుపతయ్య బైరి సత్యనారాయణ బింగి నరహరి పల్లెపాటి శ్రీను దుషెట్టి బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.