Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గుండాల
విద్యార్థులను తల్లిదండ్రులు విద్యతో పాటు గ్రామీణ క్రీడలను ప్రోత్సహించాలని డీసీసీబీ చైర్మెన్్ గొంగిడి మహేందర్ రెడ్డి అన్నారు.శుక్రవారం మండలంలోని వెల్మజాల గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మహేంద్ర యువసేన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉమ్మడి నల్లగొండ,వరంగల్ జిల్లాల స్థాయి కబడ్డీ పోటీలను ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ క్రీడలు ఆణి ముత్యాల్లాంటి క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికి తేసేందుకు, మానసిక,శారీరక ఉల్లాసానికి దోహద పడతాయన్నారు. విద్యార్థినులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.ఇ ఆయన విద్యార్థులకు నగదు ప్రోత్సాహాన్ని అందించారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ తాండ్ర అమరావతి, జిల్లా కోఆప్షన్ సభ్యుడు ఎండీ ఖలీల్,వైస్ ఎంపీపీ మహేశ్వరం మహేందర్ రెడ్డి,మార్కెట్ వైస్ చైర్మన్ మూగల శ్రీనివాస్,సర్పంచ్ సంగి బాలకృష్ణ,ఎంపీటీసీ సంగి అలివేలు,ఎస్ఐ డి.యాకన్న, హెచ్ఎం యాదగిరి నాయకులు మందడి రామకృష్ణారెడ్డి, గడ్డమీది పాండరి గౌడ్,సంగి వేణుగోపాల్, కోలుకొండ రాములు,దార సైదులు,సింగారం పాండు,బాలకొమురయ్య,ప్రకాష్,అంజిరెడ్డి, రాజాపేట, గుండాల యూత్ అధ్యక్షులు పల్లె సంతోష్ గౌడ్,అట్ల రంజిత్ రెడ్డి నిర్వాహకులు దయాకర్, తదితరులు పాల్గొన్నారు.