Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ పమేలా సత్పతి
నవతెలంగాణ -భువనగిరిరూరల్
జిల్లాలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు విజయవంతంగా అమలవుతున్నట్లు కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. శుక్రవారం 11 రాష్ట్రాల నుండి వచ్చిన సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన కేంద్ర ప్రత్యేక అధికారుల 78 మంది బృందం సెక్రటరీ కైలాష్ కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లఖన్ సింగ్, ప్రాజెక్ట్ మానిటరింగ్ ఆఫీసర్ ప్రదీప్త శేఖర్, ట్రైనింగ్ మానిటరింగ్ ఆఫీసర్ శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో కలెక్టర్‌ను కలిశారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ మీటింగ్ హాల్లో జరిగిన సమావేశంలో జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై కలెక్టర్ వారికి వివరించారు. సంసద్ ఆదర్శ గ్రామీణ యోజన కార్యక్రమాలలో జిల్లా లోని వడపర్తి, కొలనుపాకన్నారు. పల్లెప్రగతి కార్యక్రమాల ద్వారా గ్రామాల వికాసానికి కావాల్సిన పనులను గ్రామ సభలలో గుర్తించి పనులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్ ఏర్పాటుతో పచ్చదనం, పారిశుధ్య నిర్వహణను పకడ్బందీగా చేపడుతున్నట్లు తెలిపారు. ఇంటింటి తడి పొడి చెత్త సేకరించినట్టు తెలిపారు. శుక్రవారం సభల ఏర్పాటుతో అంగన్వాడీలలో, గ్రామ పంచాయతీల్లో మాతా శిశు సంరక్షణ కోసం తల్లులకు, గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు విశదీకరిస్తూ అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఆశా, ఎఎన్ఎం సిబ్బంది తోడ్పాటుతో ప్రతి ఇల్లు సందర్శించి ఆరోగ్య సేవలు, సలహాలు, మందులు అందించడం జరుగుతున్నదని, మహిళల్లో 70 శాతం ఉన్న రక్తహీనతను 40 శాతానికి తగ్గించడం జరిగిందని, పోషణలోపం ఉన్న పిల్లలను సాధారణ స్థితికి తీసుకు రావడం జరుగుతున్నదన్నారు.
వడపర్తి గ్రామ సందర్శన
అనంతరం ప్రతినిధుల బృందం జాతీయ స్థాయిలో సంసద్ ఆదర్శ గ్రామ యోజన కింద కేంద్ర ప్రభుత్వంచే ర్యాంకింగ్ పొంది ప్రథమ స్థానంలో నిలిచిన భువనగిరి మండలం వడపర్తి గ్రామాన్ని సందర్శించి, క్షేత్ర పరిశీలన జరిపారు. పాఠశాల అభివృద్ధి పనులను, టాయిలెట్స్ తరగతి గదులను, నర్సరీ, అంగన్వాడి, వైకుంఠధామం, తడి చెత్త పొడి చెత్త సెగ్రిగేషన్, కంపోస్ట్ షెడ్లను పరిశీలించారు. అలాగే గ్రామంలో ప్రజా పంపిణీ వ్యవస్థను పరిశీలించారు. గ్రామసభలో పాల్గొని స్థానిక సర్పంచ్ ఎలిమినేటి కృష్ణారెడ్డి, ప్రజలతో ముఖాముఖి జరిపారు. గ్రామపంచాయతీ ద్వారా ప్రజలకు అందే వివిధ సేవలను వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామ సమాఖ్య మహిళా సంఘాల పనితీరును పరిశీలించారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ కార్య నిర్వహణ అధికారి సిహెచ్ కృష్ణారెడ్డి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి మందడి ఉపేందర్ రెడ్డి, జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ శ్రీనివాసరావు, డీఆర్డీఏ పీడీ నాగిరెడ్డి, ఏపీడీ శ్యామల, భువనగిరి మండల అభివృద్ధి అధికారి నరేందర్ రెడ్డి, గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులు పాల్గొన్నారు.